విజయేంద్ర ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘రేష్మాస్ ఆర్ట్స్’ ‘వల్లీ’ టీం

గతేడాది బాక్సాఫీస్ వద్దనే కాకుండా… ప్రేక్షకుల మదిలో కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాల రచయిత శ్రీ. విశ్వ విజయేంద్ర ప్రసాద్ గారి జన్మదినం నేడు. 2015 సంవత్సరంలో ఉత్తమ కథా రచయితగా గిల్డ్, స్క్రీన్, మరియు ఫిల్మ్ పేర్ అవార్డులను సొంతం చేసుకున్న విజయేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై శ్రీ. రాజ్ కుమార్ బృందావన్ గారు నిర్మిస్తున్న చిత్రం వల్లీ.

ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సైన్స్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రొమాంటిక్, ఎరోటిక్ థ్రిల్లర్ అయిన వల్లీ ద్వారా మిస్ ఇండియా నేహా హింగే, రజత్ కృష్ణ, అర్హాన్ ఖాన్, సూఫీ సయ్యద్ లు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. వీరితో పాటు రాజీవ్ కనకాల, సురేఖా వాణి, హేమ, రక్ష, ఝాన్సీ, కెప్టెన్ చౌదరి, సాత్విక్ వర్మ, సమ్రీన్, సమీర్ తదితరులు నటించారు.

వినూత్నమైన కథాంశంతో, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత రాజ్ కుమార్ బృందావన్ మరియు చిత్ర బృందం నమ్మకాన్ని వ్యక్తం చేశారు.