వారధి డిఫరెంట్ జోనర్…ఆత్మల కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది – హీరో క్రాంతి

ఈ మధ్య కాలంలో వచ్చిన ఇంట్రస్టింగ్ ట్రైలర్స్ లో ఒకటిగా నిలిచింది వారధి చిత్రం. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 17న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, ఆ ఐదుగురు చిత్రాల్ల్లో ప్రధాన పాత్ర పోషించిన క్రాంతి హీరోగా నటించాడు. కాస్మిక్ ఇమాజినేషన్స్ పతాకంపై సతీష్ కార్తికేయ దర్శకత్వం వహించారు. వివేకానందశర్మ నిర్మించిన ఈ చిత్రం పక్కా కమర్షియల్ సినిమా అని హీరో క్రాంతి అంటున్నాడు. ఈ సినిమా హైలైట్స్ గురించి క్రాంతి ఏమన్నాడంటే…

మాది గుంటూరు. ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశాను. వైజాగ్ లో సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు మల్లెల తీరంలో అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఇక వారధిలో పెర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాది. కమర్షియల్ గా హిట్ అయ్యే అవకాశాలున్న పాత్ర కావడంతో వెంటనే ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. నా పాత్రకు నెగెటివ్ షేడ్ ఉంటుంది. ఎదుటి వారు బాధపడుతున్నా నేను మాత్రం చాలా ఫన్నీగా తీసుకుంటాను. అసలు అతను అలా ఎందుకు ప్రవర్తిస్తాడు. దాని వెనక రీజన్ ఏంటి… చివరికి ఎలా రియలైజ్ అవతాడన్నది దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. సినిమాలో హ్యూమన్ వాల్యూస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ వారధి. వారధిలో ఆత్మల గురించి ఉంటుంది. అప్పటివరకు నేను టార్చర్ పెడతాను. నన్ను మిగతా వాళ్లు ఎలా పెట్టారనేది కామెడీగా చూపించాం. ఫన్ ఎలిమెంట్స్ కోసం ఘోస్ట్ కాన్సెప్ట్ పెట్టాం.

మొదట్లో ఈ చిత్రానికి ఆరాధన అనే టైటిల్ అనుకున్నాం. ఈ సినిమా కథ మొత్తం శ్రీ దివ్య చుట్టే తిరుగుతుంది. డైరెక్టర్ సతీష్ కార్తికేయ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్. కొత్త కాన్సెప్ట్ ని కొత్తగా చూపించారు. డైలాగ్స్ బాగా రాస్తారు. ఇలాంటి జోనర్ చిత్రాలు తెలుగులో చాలా తక్కువ. ఈ సినిమా తర్వాత నేను చంద్రుడిలో ఉండే కుందేలు అనే చిత్రంలో నటించాను. షూటింగ్ పూర్తయింది. పెర్ పార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఉన్న పాత్రలు చేయాలని ఉంది. పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేసే వాళ్లు తక్కువగా ఉన్నారు.

సో .. ఆ గ్యాప్ నాలాంటి వాళ్లే ఫిల్ చేయాలి. అని అన్నారు.