బాహుబలి ట్రైలర్‌పై వర్మ రివ్యూ….వర్మ మార్కులివే

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే కామెంట్లలో ఏదైనా సంచనలమే. తాజాగా సోమవారం సాయంత్రం రిలీజ్ అయిన ప్రెస్టేజియస్ మూవీ బాహుబలి సినిమా ట్రైలర్‌ను ఆయన రివ్యూ చేసి ట్వీట్టర్‌లో కామెంట్ల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ స్థాయి సినిమాలతో పోలిస్తే బాహుబలికి తాను వందకు 70 మార్కులు వేస్తానని వర్మ తెలిపారు.

ఇక బాహుబలిని జాతీయ సినిమాలతో పోలిస్తే 100కు 500 మార్కులు వేస్తానని చెప్పాడు. ఓ సినిమా ప్రేమికుడిగా రాజమౌళి పట్టుదల, ఓర్పు, సహనం తనకు ఎంతో నచ్చాయంటూ వర్మ జక్కన్నకు థ్యాంక్స్ చెప్పాడు.

బాహుబలి ఇండియన్ సినిమాలతో ఓ తాజ్‌మహాల్ లాంటిదని…. ఇది ఇండియన్ సినిమా హిస్టరీకి ఓ రిఫెరెన్స్‌లా ఉపయోగపడుతుందని వర్మ ట్వీట్ చేశాడు.