వాల్మీకి క్లారిటీ ఇచ్చాడు….

డిజే త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ ఏడాదికి పైగా ఖాళీగానే ఉన్నాడు. చాలా క‌థ‌లు అనుకున్నాడు కానీ ఏదీ సెట్ కాలేదు. చివ‌రికి త‌మిళ‌నాట విజ‌యం సాధించిన జిగ‌ర్తాండ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో చిక్క‌డు దొర‌క‌డుగా డ‌బ్బింగ్ అయింది కూడా. అయినా స‌రే ఆ క‌థ‌ను మ‌న ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లుగా మార్చేస్తున్నాడు హ‌రీష్. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ కూడా స‌గానికి పైగా పూర్త‌యింది. ఇప్పుడు వాల్మీకి విడుద తేదీ క‌న్ఫ‌ర్మ్ అయింది. తాజాగా వ‌రుణ్ తేజ్ రిలీజ్ డేట్ తో ఉన్న పోస్ట‌ర్ ట్వీట్ చేసాడు. ఇందులో వ‌రుణ్ తేజ్ నెగిటివ్ కారెక్ట‌ర్ చేస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసిన పాత్ర‌ల‌తో పోలిస్తే ఇది చాలా భిన్న‌మైన పాత్ర‌. సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంద‌ని తెలిపాడు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్.
ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రీ టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తి పెంచేసింది. ఒరిజిన‌ల్ నుంచి లైన్ మాత్ర‌మే తీసుకుని త‌న స్క్రీన్ ప్లే జోడిస్తున్నాడు. క‌చ్చితంగా ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాడు హ‌రీష్ శంక‌ర్. ఇందులో వ‌రుణ్ తేజ్ లుక్ నిజంగానే భ‌య‌పెడుతుంది. ఈ చిత్రంపై ముందు నుంచి ఉన్న అంచ‌నాల‌ను ప్రీ టీజ‌ర్ మ‌రింత హైప్ కు తీసుకెళ్లింది. బాబీ సింహాకు నేష‌న‌ల్ అవార్డ్ తీసుకొచ్చిన పాత్ర‌ను ఇక్క‌డ వ‌రుణ్ తేజ్ చేస్తున్నాడు. ఇక సిద్ధార్థ్ పాత్ర‌లో త‌మిళ హీరో అథ‌ర్వ ముర‌ళి న‌టిస్తున్నాడు. డిజే త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా కోసం భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుందట. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తుంది.