బాబు వ‌రుణ్.. నెక్ట్స్ ఏంట‌మ్మా..?

నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఫిదాతోనే బిజీగా ఉన్నాడు వ‌రుణ్ తేజ్. ఇంకా చెప్పాలంటే ఏడాదిగా మిస్ట‌ర్.. ఫిదా సినిమాల‌తో బిజీగానే ఉన్నాడు ఈ మెగా హీరో. ఇప్పుడు ఆ రెండు సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇందులో మిస్ట‌ర్ నిరాశ‌ప‌రిచినా.. ఫిదా మాత్రం వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంతో వ‌రుణ్ తేజ్ ఇమేజ్.. మార్కెట్ రెండూ బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు ఎగ‌బ‌డుతున్నారు. మ‌రో హిట్ ప‌డితే వ‌రుణ్ కూడా స్టార్ అయిపోవ‌డం ఖాయం. ఫిదా విజ‌యంలో సాయిప‌ల్ల‌వి ఎక్కువ మార్కులు ప‌ట్టుకెళ్లినా.. త‌న లుక్స్ తో ఫిదా చేసాడు వ‌రుణ్. దాంతో ఇప్పుడు ఈ కుర్ర హీరో నెక్ట్స్ సినిమాపై ఆస‌క్తి మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా చేయ‌బోతున్నాడ‌నే విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు మెగా ప్రిన్స్. క‌థ‌లు విన‌డంతోనే బిజీగా ఉన్నాడు. మ‌రి చూడాలిక‌.. ఈ హీరో ఎలాంటి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తాడో..?