హీరో సిద్ధార్థ్ టక్కర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన మెగా హీరో వరుణ్ తేజ్, టక్కర్ 2020 ఫిబ్రవరి లో విడుదల !!!

మెగా హీరో వరుణ్ తేజ్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం టక్కర్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వైర్క్స్ జరుపుకుంటుంది. 2020 ఫిబ్రవరి లో ఈ మూవీని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సుధన్ సుందరం, జయరాం నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.
గతంలో కప్పల్, పండవుల్లో ఒకడు చిత్రాలకు దర్శకత్వం వహించిన కార్తిక్ జీ క్రిష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నివాస్ కె ప్రసన్న ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
Varun Tej unveils title poster of Siddharth’s ‘Takkar’
Mega prince, Varun Tej unveiled the title poster of Siddharth’s upcoming film, ‘Takkar’.
‘Takkar’ stars Siddharth, Divyansha Kaushik, Abhimanyu Singh, and Yogi Babu in lead roles.
The first look poster of the film will be out next week and it is scheduled to hit the sliver screens in February, 2020.
Sudhan Sundaram and Jayaram will be bankrolling this film on Passion Studios banner.
Karthik G Krish, who previously directed Kappal, Pandavullo Okadu is at the helm for this film. Nivas K Prasanna will be scoring the tunes.