వీడికి దూకుడెక్కువ మూవీ రివ్యూ

ఏ నిర్మాతకైనా అందుబాటులో ఉండే హీరో శ్రీకాంత్. ఓ వైపు ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే మరో వైపు యాక్షన్ ప్రధానమైన చిత్రాల్లోనూ నటిస్తూ దూకుడేంటో చూపిస్తున్నాడు. శ్రీకాంత్ కున్న క్రేజ్ దృష్ట్యా ఆయన నటిస్తున్న చిత్రాల్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు. అలా దాదాపు 300 థియేటర్లలో విడుదైన చిత్రం వీడికి దూకుడెక్కువ. శ్రీకాంత్ సరసన బ్యూటీ కామ్నా జఠ్మలాని హీరోయిన్ గా నటించింది. పుష్యమి ఫిలిం మేకర్స్‌ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. సత్యనారాయణ ద్వారపూడి ఈ చిత్రానికి దర్శకుడు. మరి యాక్షన్ తరహా చిత్రంలో శ్రీకాంత్ ఎలా మెప్పించాడో…దర్శకుడి టేకింగ్ ఎలా ఉంది… ప్రేక్షకులకు ఏ మేరకు రీచ్ అయ్యే అవకాశముందో చూద్దాం.

కథ :
క్రాంతి (శ్రీకాంత్) పోలీసాఫీసర్. దూకుడుగా డ్యూటీ చేయడమే అతని నైజం. ఎక్కడ అన్యాయం జరిగినా ఎంతకైనా తెగిస్తాడు. అలా చాలా ముఠాల్ని అంతమొందిస్తాడు. అలాంటి సమయంలో తన చిన్ననాటి స్నేహితురాలు చాముండేశ్వరి (కామ్న జఠ్మలాని) కలుస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే దేవాలయాలపై పరిశోధన చేసేందుకు మలేషియా వెళ్తుంది చాముండేశ్వరి. అక్కడ అమ్మాయిలను లొంగదీసుకొని అమ్మేసే దుండగుల ముఠా ఆమెను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ కు గురైన తన ప్రేమికురాలిని ఎలా విడిపించాడు. ఆ దుండగుల్ని ఎలా అంతమొందించాడన్నదే అసలు కథ.

సమీక్ష
శ్రీకాంత్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన యాక్షన్ సన్నివేశాల్ని ఇరగదీశాడు. అంతే కాదు శ్రీకాంత్, చంద్రమోహన్, కృష్ణభగవాన్ కాంబినేషన్లో కామెడీని పండించారు. ఈ సినిమాకు ఆ ఎపిసోడ్స్ ప్రధాన బలంగా నిలిచాయి. శ్రీకాంత్ ఎమోషనల్ సీన్స్ లో డైలాగ్ డెలివరీ బాగుంది. కామ్నా జఠ్మలాని శ్రీకాంత్ కాంబినేషన్ చూడటానికి బాగుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ముఖ్యంగా పాటల్లో కామ్నా బాగుంది. ఎమ్మెస్ నారాయణ కామెడీ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది. అజయ్ కి అలవాటైన పాత్రే.

ఫస్ఠాప్ లో వచ్చే కామెడీ బాగుంది. ప్రేక్షకులకు బాగా రిలాక్సేషన్ ఇచ్చింది. అక్కడక్కడ బోరింగ్ సన్నివేశాలు ఇబ్బంది పెట్టినప్పుడు ఈ కామెడీ సేవ్ చేసింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ కనెక్టింగ్ గా ఉన్నాయి. అమ్మాయిలను అమ్మకానికి పెట్టే సన్నివేశాలు కావడంతో అందరికీ నచ్చుతాయి. కథలో దమ్ము లేకపోయినా… శ్రీకాంత్ తన భుజాల మీద వేసుకొని కథను నడిపించాడు.

బలమైన కథ లేకపోవడంతో సన్నివేశాలు తేలిపోయాయి. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని కూర్చోబెట్టే స్టఫ్ లేదు. చాలా సీన్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. సన్నివేశాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇంట్రస్ట్ పోతుంది. పాటలు పెద్దగా పనికి రాకుండా పోయాయి. మలేషియా బ్యాక్ డ్రాప్ సీన్స్ కూడా నస పెట్టాయి. విసుగు తెప్పించే సన్నేవేశాలు ఎక్కువయ్యాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు.

దర్శకుడు చాలా వరకు తన ప్రతిభ చూపించుకునేందుకు ట్రై చేశాడు. కానీ…బలమైన కథ కాకపోవడం… దానికి తగ్గట్టుగా సన్నివేశాలు రాసుకోవడంలో విఫలమయ్యారు. ఫస్టాఫ్ లో వచ్చే కామెడీ సన్నివేశాలు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం బాగా క్యారీ చేయగలికాడు. మిగిలిన సన్నివేశాల గురించి బాగా కేర్ తీసుకోవాల్సింది.

చక్రి అందించిన పాటలు కూడా సినిమాను కాపాడలేకపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. అయితే సినిమాటోగ్రాఫర్ సురేందర్ రెడ్డి కావడంతో విజువల్ గా చూడటానికి అందంగా ఉంది. తన సినిమాటోగ్రఫితో కొంతవరకు సేవ్ చేశాడు. ఇక చిత్ర నిర్మాతలు అవసరమైన దానికంటే ఎక్కువే ఖర్చు చేశారు. ముఖ్యంగా ఆర్టిస్టుల విషయంలో టెక్నికల్ విషయాల్లో కాంప్రమైజ్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మేకింగ్ తో పాటు గ్రాండ్ గా రిలీజ్ చేయగలిగారు.

ఫైనల్ గా...
శ్రీకాంత్ మాస్ యాక్షన్ ఎమోషనల్ మూవీలో నటించి చాలా రోజులైంది. శ్రీకాంత్ అభిమానుల్ని మెప్పించే చిత్రంగా మిగిలిపోయింది. అయితే అన్ని వర్గాల్ని ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. సో….శ్రీకాంత్ కోసం ఈ చిత్రాన్ని ఓసారి చూసెయ్యెచ్చు…