మధుర శ్రీధర్ చేతుల మీదుగా ‘వీరి వీరి గుమ్మడిపండు’ ట్రైలర్‌ విడుదల

రుద్ర, వెన్నెల, సంజయ్‌, బంగారం తదితరులు ప్రధాన పాత్రధారులుగా దుగ్గిన్‌ సమర్పణలో శివకృతి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎం.వి.సాగర్‌ దర్శకుడుగా కెల్లం కిరణ్‌కుమార్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘వీరి వీరి గుమ్మడిపండు’. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్ లో జరిగింది. ప్రముఖ దర్శక నిర్మాత మధురశ్రీధర్‌రెడ్డి ట్రైలర్‌ను విడుద చేశారు. అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో…

దర్శక నిర్మాత మధురశ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఎం.వి.సాగర్‌, నిర్మాత కిరణ్‌కుమార్‌ నాకు మంచి మిత్రులు. మా ఆఫీస్‌ పక్కనే ఉండటంతో ఆ పరిచయం ఇంకా పెరిగింది. సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న వ్యక్తులు. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటారు. సాంగ్స్‌, ట్రైలర్స్ చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద హిట్టయి నిర్మాతకు మంచి లాభాలు వచ్చి, మరిన్ని చిత్రాు చేయాని కోరుకుంటున్నాను. టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

నిర్మాత కెల్లం కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘నేను, డైరెక్టర్‌ సాగర్‌ మంచి స్నేహితులం. ఎప్పుడు కలిసినా సినిమా గురించే మాట్లాడుకుంటుంటాం. అయితే గతేడాది మాటల సందర్భంలో సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాం పక్కా ప్లానింగ్ తో సినిమాని స్టార్ట్‌ చేశాం. సినిమాకు ముందు పక్కా ప్లానింగ్‌ చేసుకుని సెట్స్ లోకి వెళ్ళాం. సాగర్‌ మంచి కథను, చక్కగా తెరకెక్కించాడు. సినిమాను 32రోజుల్లోనే పూర్తి చేసేశాం. సపోర్ట్‌ చేసిన టీమ్‌ అంతటికీ థాంక్స్‌’’ అన్నారు.

దర్శకుడు ఎం.వి.సాగర్‌ మాట్లాడుతూ ‘‘యదార్థ ఘటన ఆధారంగానే ఈ సినిమాని తెరకెక్కించాం. ఈ కథను నిర్మాత కిరణ్‌కుమార్‌గారికి చెప్పగానే ఆయనెప్పుడు చేద్దామా అని ఎదురుచూశారు. సినిమా కథ చెప్పగానే ఆయనకు నచ్చింది. వెంటనే స్టార్ట్ చేద్దామని అన్నారు. అయితే నేను తొందర పడకుండా ఐదు నెలల వరకు ప్లానింగ్‌ చేసుకుని, నటీనటులను ఎంపిక చేసుకుని, యాక్టింగ్‌ ప్రాక్టీస్‌ చేయించి ప్లానింగ్‌తో, బౌండెడ్‌ స్క్రిప్ట్ తో సినిమాని 32రోజుల్లోనే పూర్తి చేశాం. రుద్ర, సంజయ్‌, వెన్నె, బంగారమ్‌ అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. పోసాని, రఘుబాబు వంటి ప్యాడింగ్‌ ఆర్టిస్టులు బాగా ఎంకరేజ్‌ చేశారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌’’ అన్నారు.
సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అవకాశం ఇచ్చినందకు దర్శక నిర్మాతకలు థాంక్స్ అని రుద్ర, సంజయ్, వెన్నెల చెప్పారు.

హార్దిక్‌, రషిత్‌, పోసాని, రఘుబాబు, శివన్నారాయణ, దీక్షిత్‌, అనంత్‌, ప్రవీణ్‌, రాజేంద్ర, శ్రీ ఎక్క, మధుమణి, మానస, జ్యోతి, ఖుషి, పూర్ణిమ, రవికాంత్‌, శ్రీకాంత్‌ తదితయి నటించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: శక్తి స్వరూప్‌, మ్యూజిక్‌: పి.ఆర్‌, సినిమాటోగ్రఫీ: కె.యం.కృష్ణ, ప్రొడ్యూసర్‌: క్లెం కిరణ్‌కుమార్‌, దర్శకత్వం: ఎం.వి.సాగర్‌.