విజ‌య్ ఆంటోనీ…. దుకాణం సర్దేసినట్టే….

విజ‌య్ ఆంటోనీ.. ఈ పేరుకు తెలుగులో కూడా మంచి గుర్తింపే ఉంది. ఒక‌ప్పుడు బిచ్చ‌గాడు అంటే ఫీలయ్యే వాళ్లు కానీ ఆ త‌ర్వాత విజ‌య్ ఆంటోనీ సినిమా వ‌చ్చిన త‌ర్వాత మాత్రం అలా ఫీల‌వ్వ‌డం మానేసారు. బిచ్చ‌గాడిగా వ‌చ్చి కోటీశ్వ‌రుడు అయ్యాడు విజ‌య్. మూడేళ్ల కింద ప‌బ్లిసిటీ లేకుండా మౌత్ ప‌బ్లిసిటీతో 15 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ ఒక్క సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఇప్ప‌టికీ తెలుగు ఇండ‌స్ట్రీని వ‌ద‌ల‌డం లేదు విజ‌య్ ఆంటోనీ. అయినా ఈ అర‌వోళ్లు మ‌హా ముదుర్లండీ బాబూ..! మ‌న హీరోలు త‌మిళ‌నాడు వెళ్లి అక్క‌డ త‌మ సినిమాలు విడుద‌ల చేయ‌డం ఈ మ‌ధ్యే నేర్చుకున్నారు. సినిమాలు ఫ్లాపైతే.. నెక్ట్స్ టైమ్ క‌నీసం ట్రై కూడా చేయ‌ట్లేదు. కానీ త‌మిళ హీరోలు మాత్రం ఆ టైప్ కాదండీ బాబూ..! చూడండి.. మీరు చూడాలి.. మీరు చూస్తూనే ఉండాలి.. చూడ‌క‌పోతే ఊరుకోం.. అంటూ మ‌న‌ల్ని హిప్న‌టైజ్ చేసి పారేస్తున్నారు. బిచ్చ‌గాడు త‌ర్వాత విజ‌య్ ఆంటోనీ కూడా ఇదే చేస్తున్నాడు.

త‌మిళ్ లో మంచి ఇమేజ్ ఉన్నా.. తెలుగులో మాత్రం విజ‌య్ ఆంటోనీకి పెద్ద‌గా గుర్తింపు లేదు. బిచ్చ‌గాడు త‌ర్వాత విజ‌య్ ఆంటోనీ సినిమాల‌పై మ‌న ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి పెరిగింది. ఆ సినిమా హిట్ట‌వ్వ‌డంతో వ‌ర‌స‌గా త‌న సినిమాల‌న్ని దాదాపు 4 కోట్ల వ‌ర‌కు బిజినెస్ చేసుకున్నాడు. బేతాళుడు.. ఇంద్ర‌సేన‌.. య‌మ‌న్.. కాశీ.. ఇలా వ‌ర‌స‌గా చాలా సినిమాలు విడుద‌ల చేసాడు విజ‌య్. కానీ ఇందులో ఏ ఒక్క సినిమా కూడా క‌నీస ఓపెనింగ్స్ తెచ్చుకోలేదు. ఇప్పుడు ఈయ‌న మార్కెట్ 70 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. డబ్బుల‌కు ఆశ‌ప‌డి ముక్కు మొహం తెలియ‌ని నిర్మాత‌ల‌కు అమ్ముకుంటున్నాడు విజ‌య్. దాంతో వాళ్ల‌కు ఇక్క‌డ క‌నీసం సినిమా విడుద‌ల చేయ‌డానికి థియేట‌ర్స్ కూడా దొర‌క‌డం లేదు. ఇప్పుడు కిల్ల‌ర్ సినిమా ప‌రిస్థితి కూడా అంతే. ఈ సినిమా విడుద‌లైన సంగ‌తి కూడా ఎవ‌రికీ తెలియ‌దు. ఎప్పుడొచ్చి ఎప్పుడెళ్లిపోతుందో అన్న‌ట్లుంది కిల్ల‌ర్ సినిమా ప‌రిస్థితి. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో… ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డాడు విజయ్. మొత్తానికి త‌గిన జాగ్ర‌త్త‌లు కానీ తీసుకోలేదంటే ఫ్యూచ‌ర్‌లో విజ‌య్ ఆంటోనీ అనే హీరోను గుర్తు పెట్టుకోవ‌డం కూడా క‌ష్ట‌మే.