దిల్ రాజుతో విజయ్ దేవరకొండ గొడవేంటి….

అసలు ఏం జరుగుతోంది..? ఇండస్ట్రీలో దిల్ రాజును మించిన నిర్మాత ప్రస్తుతం అయితే ఎవరూ లేరు. అలాంటి నిర్మాతతోనే గొడవ పడేంత సాహసం ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తున్నాడా..? ఏమో ఇప్పుడు ఇదే వినిపిస్తుంది మరి ఇండస్ట్రీలో. ఎందుకో తెలియదు కానీ ప్రస్తుతం విజయ్, దిల్ రాజు మధ్య మాత్రం ఏదో తెలియని వార్ మాత్రం నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. దీని వెనక కారణాలు మాత్రం సస్పెన్స్ గానే ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. ఎప్పట్నుంచో విజయ్ దేవరకొండతో దిల్ రాజు సినిమా చేయాలనుకుంటున్నాడని సమాచారం. కానీ విజయ్ మాత్రం ఇప్పటి వరకు దీని గురించి క్లారిటీ ఇవ్వలేదట.

ఇప్పుడు అప్పుడూ అంటూ సాగదీస్తున్నాడే కానీ సినిమా చేయడానికి విజయ్ ఎందుకో సుముఖత చూపించడం లేదట. ఇక్కడే అసలు వార్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. తనను కూడా వేచి చూసేలా చేయడం దిల్ రాజుకు నచ్చట్లేదని.. తాను అడిగితే అంతా ఓకే చెప్తారు కానీ విజయ్ మాత్రం ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడం లేదని సన్నిహితులతో దిల్ రాజు చెప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. డియర్ కామ్రేడ్ సినిమాతో విజయ్ దేవరకొండ జోరుకు బ్రేకులు పడిపోయాయి. ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాలకు కమిటయ్యాడు ఈయన. అందుకే దిల్ రాజు సినిమాకు ఓకే చెప్పలేకపోతున్నాడని విజయ్ సన్నిహితుల వాదన. ఏదేమైనా ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య వార్ మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది.