విజయ్ సేతుపతి మూవీ రివ్యూ

విజయ్ సేతుపతి మూవీ రివ్యూ

విజయ్ సేతుపతి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యే సైరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇదే ఊపుతో విజయ్ సేతుపతి తమిళ్ లో నటించిన చిత్రాన్ని ఆయన పేరునే టైటిల్ గా పెట్టి గ్రాండ్ గా విడుదల చేశారు. రాశి ఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ .  విజయ్ చందర్ దర్శకుడు. విజయా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. హర్షిత మూవీస్ తెలుగులో విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

సమీక్ష
విజయ్ కి ఇది విభిన్నమైన సినిమా. ఆయన కెరీర్ లో ఎక్కువ యాక్షన్ ఉన్న సినిమా. తెలుగు నేటివిటీ కి సరిపోయే కథా, కథనాలతో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమా.  విజయ్ పెరఫార్మెన్సు ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ఆయన చెప్పిన ఎమోషన్ డైలాగ్స్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. కథను తన భుజాల మీదేసుకున్నాడు. రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. రాశి ఖన్నా గ్లామర్ పాత్రలో మెప్పించింది. నివేదా ట్రాడిషనల్ క్యారెక్టర్ లో కనిపించింది. నాజర్, అశుతోష్ రాణా రవికిషన్ కీలక పాత్రల్లో మెప్పించాడు. దర్శకుడు విజయ్ కమర్షియల్ అంశాల్ని బాగా జోడించాడు.  ఎమోషనల్ గా బాగా కదిలించాడు. స్క్రీన్ ప్లే చాలా బాగా ప్లాన్ చేశాడు. మ్యూజిక్ దర్శకుడు వివేక్ – మెర్విన్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారూ.
‘నిర్మాత రావురి వి. శ్రీనివాస్ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ రానివ్వకుండా డబ్బింగ్ చేయించారు. గ్రాండ్ గా రిలీజ్ చేశారు. వెన్నెల కంటి, ఆయన తనయుడు రాకేంద్రమౌళి పాటలకు తెలుగదనం అద్దారు.  ఆర్. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. అనల్ అరసు ఫైట్స్ చాలా బాగా కంపోజ్ చేశారు.

ఊర్లో మంచి పేరున్న కుటుంబం హీరో ది. కానీ ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటుంది విలన్ బ్యాచ్. వారి ఆగడాలను హీరో ఎలా అడ్డుకున్నదన్నదే అసలు కథ. కథ కథనం ఈ సినిమాకు ప్రధాన బలం. బలమైన సన్నివేశాలు నిలబెట్టాయి. ఈ తరహా స్క్రీన్ ప్లే తో మనం సినిమా చూడలేదు. సినిమా ప్రారంభం లో అమ్మాయి కాపాడే సీన్ దగ్గరినుంచే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశాడు. దాదాపు ప్రతి సీన్ ను పండించేందుకు డైరెక్టర్ ట్రై చేశాడు.

చివరగా…
ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ‘విజయ్ సేతుపతి’లో పుష్కలంగా ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో పాటు  ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయి. సో గో అండ్ వాచిట్

PB Rating : 3.25/5