విజయనిర్మల మొదటి భర్త వివరాలు తెలుసా…..

విజ‌య‌నిర్మ‌ల అంటే వెంట‌నే గుర్తొచ్చే మ‌రో పేరు కృష్ణ‌. సూప‌ర్ స్టార్‌గా తెలుగు ఇండ‌స్ట్రీని ఏలేస్తున్న స‌మ‌యంలోనే విజ‌య‌నిర్మ‌ల‌ను పెళ్లి చేసుకున్నాడు ఈయ‌న‌. కృష్ణ‌కు ఈమె రెండో భార్య అని అంద‌రికీ తెలుసు. పైగా కృష్ణ మొద‌టి భార్య పేరు ఇందిరా అని.. మ‌హేష్ బాబు కూడా ఆమె త‌న‌యుడు అని అంద‌రికీ క్లారిటీ ఉంది. కానీ విజ‌య‌నిర్మ‌ల మొద‌టి భ‌ర్త ఎక్క‌డుంటాడు.. ఏం చేస్తాడు.. ఆయ‌న ఎలా ఉంటాడు అనేది మాత్రం ఆమె చ‌నిపోయే వ‌ర‌కు కూడా స‌స్పెన్సే. పైగా విజ‌య‌నిర్మ‌ల త‌న‌యుడు న‌రేష్ కూడా ఎప్పుడూ నాన్న గురించి వివ‌రాలు చెప్ప‌లేదు. అమ్మ‌తో త‌న‌కు ఉన్న అనుబంధం గురించి మాత్ర‌మే చెప్తాడు ఆయ‌న‌. అయితే విజ‌య‌నిర్మ‌ల చ‌నిపోయిన వారం రోజుల త‌ర్వాత ఆమె పాత ఇంట‌ర్వ్యూ ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అందులో ఆమె త‌న తొలి భ‌ర్త గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు. అది కూడా ఇప్ప‌టి ఇంట‌ర్వ్యూ కాదు.
న‌రేష్‌కు మూడేళ్లున్న‌పుడు అంటే దాదాపు 50 ఏళ్ల కింద ఓ వార‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల త‌న భ‌ర్త గురించి వివ‌రాలు చెప్పారు విజ‌య‌నిర్మ‌ల‌. త‌న మొదటి భ‌ర్త పేరు చెప్ప‌లేదు కానీ ఆయ‌న ఇంజ‌నీర్ అని మాత్రం చెప్పారు ఆమె. షిప్ నమూనాలు తయారు చేసే కంపెనీలో ఉద్యోగం చేసేవార‌ని చెప్పారామే. వాళ్ల సంతాన‌మే హీరో న‌రేష్. అప్ప‌ట్లో విజయనిర్మల ఫోటోలు సినిమాటోగ్ర‌ఫ‌ర్ విన్సెంట్ చూసి ఆయ‌న దర్శకత్వంలోనే భార్గవీనిలయం సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చాడు. ఇదే విష‌యాన్ని చెప్పారు విజ‌య‌నిర్మ‌ల‌. ఆ త‌ర్వాత రంగుల రాట్నం లాంటి సినిమాల్లో న‌టించారు విజ‌య‌నిర్మ‌ల‌. త‌న భ‌ర్త స‌పోర్ట్ వ‌ల్లే అప్ప‌ట్లో తాను న‌టిని అయ్యాన‌ని చెప్పారు ఈమె. ఆయ‌న వ‌ద్దు అని చెప్పుంటే క‌చ్చితంగా ఇంట్లోనే ఉండేదాన్ని అని.. కానీ మొద‌టి భ‌ర్త అండ‌దండ‌లు కూడా ఉన్నాయ‌ని గుర్తు చేసుకున్నారు అప్ప‌ట్లో విజ‌యనిర్మ‌ల‌.