వినాయ‌క్ ఇక సినిమాలు చేయ‌డా..?

నాకు రెండు నెల‌లు టైమ్ కావాలి.. ముందు నేను రెస్ట్ తీసుకోవాలి.. అఖిల్ విడుద‌లైన త‌ర్వాత వినాయ‌క్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లివి. వ‌ర‌స‌గా ప‌రాజ‌యాలు ఎదుర‌వుతుండ‌టంతో వినాయ‌క్ లో అస‌హ‌నం క‌నిపిస్తుంది. సినిమాలే చేయాలా వ‌ద్దా అనే డైల‌మాలో కూడా ఉన్నాడట ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే సినిమాల్లో వ‌చ్చిన డ‌బ్బుతో బ‌య‌ట బాగానే వెన‌కేసుకున్నాడు వినాయ‌క్. దాంతో ఇండ‌స్ట్రీ నుంచి పూర్తిగా సెల‌వు తీసుకునేందుకు విన‌య్ సిద్ధ‌మ‌య్యాడ‌నే రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.

ఆది టైమ్ లో కోటి రూపాయలు వ‌స్తే చాల‌నుకునేవాడు వినాయ‌క్. అప్ప‌ట్లో వ‌చ్చిన డ‌బ్బుతో బిజినెస్ చేసి బాగానే సంపాదించుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఇండ‌స్ట్రీలో పెద్ద‌గా టైమ్ క‌లిసిరావ‌డం లేదు. నిజం చెప్పాలంటే ఠాగూర్ త‌ర్వాత ఆ స్థాయి బ్లాక్ బ‌స్ట‌ర్ వినాయ‌క్ కెరీర్లో క‌న‌బ‌డ‌లేద‌నే చెప్పాలి. సాంబ‌, యోగి, బ‌ద్రీనాథ్ సినిమాలు ప్లాప‌య్యాయి. బ‌న్నీ, అదుర్స్, కృష్ణ‌, నాయ‌క్ సినిమాలు ఏదో కామెడీతో అలా అలా ఓకే అనిపించాయే గానీ బ్లాక్ బ‌స్ట‌ర్స్ కాదు. ఇక అల్లుడుశీనుతో బెల్లంకొండ ఇప్ప‌టివ‌ర‌కు కోలుకోలేక‌పోయాడు. అఖిల్ సంగ‌తి చెప్పాల్సిన ప‌నిలేదు.
అఖిల్ ఫ్లాప్ తో మెగాస్టార్ సినిమా ఆఫ‌ర్ కూడా వెన‌క్కి వెళ్లిపోయింది. ఇంకెందుకు సినిమాలు.. హాయిగా ప‌ర్స‌న‌ల్ లైప్ ఎంజాయ్ చేద్దామ‌నే మూడ్ లో వినాయ‌క్ ఉన్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే నెక్ట్స్ సినిమాపై కూడా నోరు విప్ప‌ట్లేదు వినాయ‌క్. మ‌హేశ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తానంటూ వినాయక్ చెబుతున్నా.. మ‌నోడి ట్రాక్ రికార్డ్ తో వాళ్లు కూడా కాస్త వెన‌క‌డుగు వేసేలా క‌నిపిస్తున్నారు. మ‌రి ఇలాంటి టైమ్ లో వినాయ‌క్ నిజంగానే సినిమాల‌కు దూరం కానున్నాడా..?