విరించి ఆధ్వర్యంలో ఒబెసిటీ క్లినిక్
– హైద్రాబాద్ లో పెరుగుతున్న స్థూలకాయులు
-ప్రతీ ఇద్దరు మహిళల్లో ఒకరు, ప్రతీ ముగ్గురు పురుషుల్లో ఒకరు, ప్రతీ ఐదుగురుపిల్లల్లో ఒకరు అధిక బరువు
– జీవనశైలి వల్లే స్థూలకాయం
విరించి హాస్పిటల్ స్థూలకాయుల కోసం హైద్రాబాద్ నగరంలో పూర్తిస్థాయిలో ప్రత్యేకంగా ఒబెసిటీక్లినిక్ ప్రారంభిస్తుంది. స్థూలకాయం అనేది భారతదేశంలో ఆందోళనకర నిష్పత్తిలో ఉంది. ముఖ్యంగా ఈ నిష్పత్తి హైద్రాబాద్లో మరింత ఎక్కువగా ఉంది. మీకు తెలుసా ప్రతీ ఇద్దరు మహిళల్లో ఒకరు, ప్రతీ ముగ్గురు పురుషుల్లో ఒకరు, ప్రతీ ఐదుగురు పిల్లల్లో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారు. వీరంతా స్థూలకాయం లేదా అధిక బరువుతో బాధపడుతున్నారు. వీరంతా స్థూలకాయం లేదా అధిక బరువుతో బాధపడుతున్నారా? ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ తాజాగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ ఎఫ్ హెచ్ ఎస్) నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ సమస్య ప్రస్తుతమే కాదు వచ్చే తరాలు కూడా ఎదుర్కోక తప్పదు. మెట్రో నగరాల్లోని ప్రతి ఐదుగురుపిల్లల్లో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు తేలింది.
విరించి ఒబెసిటీ క్లినిక్ ఎందుకు?
స్థూలకాయం అరికట్టడానికి తీసుకున్న జాగ్రత్తల మీద సమాజంలో గందరగోళం నెలకొంది. అనేక అపోహలు కూడా ఉన్నాయి. హైద్రాబాద్ లో స్థూలకాయం మీద అవగాహన పెరగాల్సి ఉంది. కొందరు తప్పుదోవపడుతున్నారు. అవసరంలేని ఆహారాన్ని తీసుకుంటున్నారు. కాస్మోటిక్ సర్జరీలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విరించి పూర్తిస్థాయిలో ఒబెసిటీ క్లినిక్ ప్రారంభిస్తుంది. ఈ నెల 11వ తేదీన స్థూలకాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ క్లినిక్ అతిపెద్ద టీంతో కల్సి ప్రారంభం కానుంది. డాక్టర్ దిలీప్ గూడె, డాక్టర్ క్రిష్ణమోహన్ లు ఈ క్లినిక్ ప్రారంభిస్తున్నారు.