విశాల్, లక్ష్మీ మీనన్ లిప్ కిస్ రగడ

విశాల్ లక్ష్మీమీనన్ కలిసి నటించిన రెండో చిత్రం ఇంద్రుడు. గతంలో వీరిద్దరు పల్నాడు అనే చిత్రంలో నటించారు. అయితే ఇంద్రుడు చిత్రంలో ఓ ఘాటు లిప్ కిస్ కూడా ఉందట. అండర్ వాటర్లో విశాల్, లక్ష్మీ మీనన్ మధ్య ఉండే అధర చుంబనాలు విశాల్ కి కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయట.

ఈ సీన్ చూసిన వారంతా వారిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం చేస్తున్నారని భాదపడుతున్నాడు. మేం ఇద్దరం డేటింగ్ లో ఉన్నామని ప్రేమించుకుంటున్నామని వార్తలొస్తున్నాయని విశాల్ తెగ ఫీలయ్యాడు. అయితే అవన్నీ నిజం కాదని సినిమాలో అవసరం కాబట్టే లిప్ కిస్ సీన్లో నటించామని ఆయన చెప్పుకొచ్చారు. 

 నార్కొలెప్సీ అనే వ్యాధిగ్రస్తుడి కథే ఇంద్రుడు. ఇటీవలే ఈ చిత్ర పాటలు హైదరాబాద్ లో విడుదలయ్యాయి. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయక్తంగా నిర్మిస్తున్నాయి. తిరు దర్శకుడు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతమందించాడు. మే 25న ఈ చిత్రాన్ని విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.