అక్కను వదిలేసి చెల్లిని వాడుతున్న విశాల్..!

తెలుగు వాడైనా అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో రాణిస్తున్న నల్లనయ్య విశాల్ తన నెక్ట్స్ సినిమాకు రెఢీ అవుతున్నారు. ఎప్పుడో 2006లో వచ్చిన పందెంకోడి హిట్ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు పందెంకోడి-2 రాబోతుంది. ఈ సినిమా పందెంకోడి సినిమాను డైరెక్ట్ చేసిన ఎన్.లింగుస్వామి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందు శృతిహాసన్‌ను తీసుకున్నా ఇప్పుడు ఆమె స్థానంలో చెల్లి అక్షరహాసన్‌ను తీసుకున్నట్టు కోలీవుడ్ టాక్. విశాల్ అక్క శృతితో పూజ సినిమాలో ఇప్పటికే రొమాన్స్ చేశాడు. పందెంకోడి సీక్వెల్‌లో కూడా ముందు శృతినే తీసుకున్నా ఆమె బిజీగా ఉండడంతో చివరకు ఆ ఛాన్స్ చెల్లెలు అక్షరకు దక్కింది.

అక్షర బాలీవుడ్ మూవీ షమితాబ్‌తో ఎంట్రీ ఇచ్చి తొలిసారిగా విశాల్ మూవీతో కోలీవుడ్‌లో అడుగు పెడుతోంది. ఇక పందెంకోడిలో హీరోయిన్‌గా నటించిన మీరాజాస్మిన్ ఈ సీక్వెల్‌లో కూడా కీలక పాత్రలో నటిస్తోందట. ప్రస్తుతం విశాల్ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకటి పాండిరాజ్ మూవీ కాగా, మరొకటి లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్న పందెంకోడి-2 మూవీ.