ఉత్కంఠ‌: ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రైన ఎమ్మెల్యే సండ్ర‌

ఓటుకు నోటు కేసులో స‌త్తుప‌ల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గతంలో పది రోజుల గడువు అడిగిన వీర‌య్య ప్ర‌స్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నాన‌ని ఏసీబీ విచార‌ణ‌కు ఎప్పుడు పిలిచినా వ‌స్తాన‌ని చెప్పారు. రెండు రోజుల క్రితం ఏసీబీ ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చి సండ్రను విచారణకు పిలిచింది.

సండ్ర‌కు ఏసీబీ సీఆర్‌పీసీ సెక్ష‌న్ 41-ఏ కింద నోటీసులు ఇచ్చింది. ఏసీబీ నోటీసుల‌కు అనుగుణంగా సోమవారం ఆయన ఏసీబీ ఎదుట విచార‌ణ‌కు హాజరయ్యారు. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ ఏసీబీ విచారణకు సహకరిస్తానని అన్నారు.తనకు ఈ కేసుతో ఎలాంటి సంబందం లేదని…తాను ఏ ఎమ్మెల్యేతోను ఓట్ల గురించి మాట్లాడలేదని ఆయ‌న తెలిపారు.

ఇక ఇదే కేసులో తెర‌పైకి వ‌చ్చిన మ‌రో సూత్ర‌ధారి జ‌మ్మిబాబును కూడా ఈ రోజు ఏసీబీ విచారించ‌నుంది. జిమ్మిబాబుకు కూడా ఏసీబీ రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. జిమ్మిబాబుకు లోకేష్‌, రేవంత్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఈ విచార‌ణ‌లో ఎలాంటి వాస్త‌వాలు వెలుగు చూస్తాయోనని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.