ఓటర్‌ మూవీ రివ్యూ….

మంచు విష్ణు ఓటర్ చిత్రం గురించి మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం ట్రైలర్స్ తో పాటు కాస్త కాంట్రవర్శీ కూడా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విష్ణు కెరీర్ లో బెస్ట్ సినిమాగా ఓటర్ నిలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. అలాగే అడ్డాతో మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కార్తీక్ ఈ సినిమాకు దర్శకుడు. సురభి ఇందులో హీరోయిన్ గా నటించింది. మరి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

కథేంటంటే…. గౌతమ్‌ (మంచు విష్ణు) అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. దేశం అంటే ప్రేమ. కేవలం ఓటు వేయడానికి అమెరికా నుంచి ఇండియా వస్తాడు. ఇక్కడ భావన (సురభి)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ‘నేను కూడా నిన్ను ప్రేమించాలంటే ఎమ్మెల్యే (పోసాని కృష్ణమురళీ) చేసిన వాగ్దానాలన్నీ నెర వేరేటట్టు చూడాలి’ అని షరతు విధిస్తుంది. ఆ ఎమ్మెల్యేకు ఓ వీడియో చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేసి మరీ ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చేటట్టు చేస్తాడు గౌతమ్‌. అయితే ఓ వ్యవహారంలో ఎంపీ శంకర్‌ ప్రసాద్‌ (సంపత్‌రాజ్‌)కి ఎదురెళ్లాల్సి వస్తుంది. ఓటరు పవరెంతో చూపిస్తానని శంకర్‌ ప్రసాద్‌తో సవాల్‌ విసురుతాడు గౌతమ్‌. మరి శంకర్‌ ప్రసాద్‌తో చేసిన పోరాటంలో గౌతమ్‌ ఎలా విజయం సాధించాడు? అసలు వీరిద్దరికీ మధ్య వచ్చిన సమస్యేంటి? అనేదే ‘ఓటర్‌’ కథ.

సమీక్ష
మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలు ఎలక్షన్స్ హడావిడితో వేడెక్కింది. ఓటు విలువ గురించి ఎంతో మంది చాటి చెప్పారు. ప్రజల ఓటుతో గద్దెనెక్కిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవకులుగా ఉండాలి. ఓటరే.. ప్రజాస్వామ్యానికి నిజమైన ఓనర్‌. అలాంటి ఓటరు శక్తి గురించి చెప్పే ప్రయత్నం ‘ఓటర్‌’లో కనిపించింది. మంచు విష్ణు కథానాయకుడిగా సరిగ్గా సరిపోయాడు. ఓటర్ పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాలో పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉంది. తనదైన పెర్ పార్మెన్స్ తో పాత్రను నిలబెట్టాడు. దర్శకుడు కార్తీక్ విష్ణు పాత్రను మలిచిన విధానం చాలా బాగుంది. మంచు విష్ణు లోని కొత్త నటుడిని బయటికి తీశాడు. క్యారెక్టర్ లో అతి లేకుండా సెటిల్డ్ గాఉంది.

ఓటరు విలువ చెప్పాలనుకున్న దర్శకుడి ప్రయత్నం ఫలించింది. ఫస్టాఫ్ లో ప్రజా ప్రతినిధి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి కథానాయకుడు చేసే అల్లరితో సాగిపోతే, రెండో సగంలో ‘రీకాల్‌’ తెరపైకి వస్తుంది. రెండూ రాజకీయ నేపథ్యం ఉన్న అంశాలే. కాబట్టి దీనిని ఓ పొలిటికల్‌ డ్రామాగా అభివర్ణించొచ్చు. మధ్యలో పాటలు, పోరాటాలు కలగలిపి… కమర్షియల్‌ హంగులు ఇచ్చారు. ఓటు కోసం రాజకీయ నాయకులు ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని అటకెక్కించడం మామూలే. రీకాల్‌ గురించి ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది. ఓటర్స్ సరిగ్గా పట్టించుకోని రీకాల్ పద్దతిని దర్శఖుడు తెరమీదకు తెచ్చాడు.

మనకు తెలిసిన విషయాన్ని ఇంకాస్త లోతుగా స్టడీ చేసి దర్శకుడు సినిమాగా తీశాడు. సో… కథ లో కాంప్లికేషన్స్ ఉండవు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే అంశాల్ని కమర్షియాలిటీ జోడించి చెప్పాడు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ని తట్టి లేపే అంశాల్ని బాగా చిత్రీకరించాడు. కథలో లీనమవ్వడానికి పెద్దగా సమయం పట్టదు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ కూడా మంచిదే. పాయింట్‌లో ఉన్న సీరియెస్‌నెస్‌.. దాన్ని చెప్పడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. పోసాని చుట్టూ సాగే సన్నివేశాలు కామెడీ గా నవ్వు తెప్పిస్తాయి. సీరియస్ విషయాన్ని ఆడియెన్స్ కి అర్థం కావాలని కాస్త కామెడీగా చెప్పాడు దర్శకుడు.

సెకండాఫ్ లో క్లీన్ గా కథను చెప్పుకుండా వెళ్లాడు. ముఖ్యంగా రీకాల్ సబ్జెక్ట్ ని సెకండా ఫ్ లో బాగా హైలైట్ చేశాడు. పూసగుచ్చినట్టు దాని గురించి వివరించాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా కథను నడిపించిన విధానం బాగుంది. బలమైన సన్నివేశాలు సినిమాను ఆసక్తికరంగా మలిచాయి. మంచు విష్ణుతో దర్శకుడు చెప్పించిన డైలాగ్స్ కి విజిల్స్ పడతాయి. సురభి క్యారెక్టర్ కూడా బాగుంది. కేవలం పాటలకు మాత్రమే కాకుండా… కథలోకి దర్శకుడు బాగా ఇన్ వాల్వ్ చేసింది. గ్లామర్ అవసరమైన చోట గ్లామరసం పండించింది. విలన్ గా సంపత్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. రీకాల్‌ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకూ సినిమా రాలేదు. అందుకే దర్శకుడు ఈ పాయింట్ ను ఎత్తుకున్నాడు. ఆ పాయింట్ ను ప్రేక్షకులకు బాగారీచ్ అయ్యేలాగా కథను చెప్పగలిగాడు దర్శకుడు. పాటలు బాగున్నాయి. డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ఇన్ స్పైరింగ్ గా ఉన్నాయి.

“అసెంబ్లీ రౌడీ” సినిమాలోని సీన్లు, స్క్రీన్ ప్లే వాడుకున్నారు అంటూ ఈ మధ్య “ఓటర్” చిత్ర వివాదం మీడియాలో కాస్త హల్ చల్ చేసింది. అయితే నిజానికి “ఓటర్” లో ఆ ఛాయలు మచ్చుకైనా కనపడలేదు. స్క్రీన్ ప్లే వరకూ ఎందుకు.. కనీసం ఒక్క సీన్ లో కూడా “అసెంబ్లీ రౌడీ” పోలికలు కానరాలేదు. మరి ఏమి లేని దానికి ఇంత వివాదం ఎందుకు రేగిందో ఆ చిత్ర వర్గాలకే తెలియాలి. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంది . దర్శకుడు జి .ఎస్ . కార్తీక్ రెడ్డి సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది .

ఓవరాల్ గా…. ఓటర్ చిత్రం ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎందుకంటే రీకాల్ విలువను చెప్పిన సినిమా. ఓటర్ విలవను మరింతగా విడమర్చి చెప్పిన సినిమా. దర్శకుడు చెప్పిన విధానం, కథను నడిపించిన తీరు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3.25/5