సార్థక్ మూవీస్ ద్వారా విడుదలౌతున్న ఓటర్

జాన్ సుధీర్ పూదోట నిర్మాతగా రామా రీల్స్ బ్యానర్ లో నిర్మితమైన చిత్రం ఓటర్. ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా అనేక చిత్రాలను నిర్మించి, పంపిణీ చేసిన ప్రశాంత్ గౌడ్ తన సార్థక్ మూవీస్ ద్వారా ఈ చిత్రాన్ని ప్రంపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ… ఈ సంవత్సరం మా సార్థక్ మూవీస్ ద్వారా అనేక విజయవంతమైన చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఓటర్ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చాలా బాగుండడంతో థియేటర్ రైట్స్ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. పోటీకి తట్టుకొని నేను ఈ చిత్రం యొక్క హక్కులు ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకున్నారు. తప్పకుండా సినిమా విజయవంతమౌతుందని గట్టిగా నమ్ముతున్నాను. అని అన్నారు.

నిర్మాత జాన్ సుధీర్ మాట్లాడుతూ… మా ఓటర్ చిత్రాన్ని ప్రశాంత్ గౌడ్ తన సార్థక్ మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. విజయం పట్ల ధీమాగా ఉన్నాను. అని అన్నారు.