ఓటర్ ను ఇరికించారు…

ఓటర్ ను ఇరికించారు…

మంచు విష్ణు స్నేహితుడైన విజయ్ కుమార్ రెడ్డి పై ఫైర్ అయిన ఓటర్ సినిమా నిర్మాత జాన్ సుధీర్ పూదోట… ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం… ఓటర్ సినిమా మొదలు పెట్టే ముందు కథపై కొంత డౌట్ వచ్చినప్పుడు, విష్ణు చిత్ర నిర్మాతలు, దర్శకుడు జీ.కార్తీక్ రెడ్డి కూర్చొని అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లే దీనికి బాగుంటుందని నిర్ణయానికి వచ్చారని చెప్తున్న మాటలు పూర్తిగా అవాస్తవాలు. అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లేకి సంబంధించి మా మధ్య ఎలాంటి మీటింగులు చర్చలు జరగలేదు. దర్శకుడు జి.కార్తీక్ రెడ్డి మా ఆఫీస్ కి 2019 మార్చి 27న సుమారు 3 గంటల సమయంలో వచ్చి మంచు విష్ణు, అతని స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి నన్ను వాళ్ల ఇంటికి అల్పాహార విందుకు అని పిలిచి, పథకం ప్రకారం ముందుగానే సిద్ధం చేసుకున్న అగ్రిమెంట్ మీద అనగా 2017 మార్చి 23వ తేదీన సిద్ధం చేసినటువంటి అగ్రిమెంట్ మీద నా చేత బలవంతంగాగ సంతంక చేయించుకున్నారని, అందులో అసెంబ్లీ రౌడీ కథ, సీన్స్, స్క్రీన్ ప్లేని వాడుకున్నందుకు 1 కోటి 50లక్షలు చెల్లిస్తానని అది తప్పుడు అగ్రిమెంట్ అని, వాళ్ల నుండి నన్ను కాపాడమని మొర పెట్టుకున్నాడు. దర్శకుడు కార్తీక్ రెడ్డికి నాకు మధ్య అసెంబ్లీ రౌడీ కథ, స్క్రీన్ ప్లే, సీన్స్ కి సంబంధించి ఎటువంటి చర్చలు జరగలేదు. దర్శకుడు జీ. కార్తీక్ రెడ్డికి, మంచు విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డిల మధ్య జరిగిన రహస్య అగ్రిమెంట్ కి సంబంధించి నన్ను డబ్బులు కట్టమనడం ఎంత వరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్న ఓటర్ సినిమా నిర్మాత సుధీర్ పూదోట. ఇన్ని గొడవలకు ముఖ్య కారణం సినిమా చాలా బాగా రావడమే. సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకమే.