ఊహలు గుసగుసలాడే ఆడియో 27న

అష్టాచెమ్మా సినిమాతో అందరి గుర్తింపు సంపాదించిన నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన చిత్రం ఊహలు గుసగుసలాడే. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ ఈనెల 27న గ్రాండ్ గా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగశౌర్య, రాశి ఖన్నా ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. 

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాదీ అబ్బాయికి ఢిల్లీ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా తెరకెక్కించారు. హైదరాబాద్, వైజాగ్ షూటింగ్ చేశారు. శ్రీనివాస్ అవసరాల సైతం ఓ కీలక పాత్ర పోషించాడు. 

కళ్యాని కోడూరి ఈ చిత్రానికి సంగీతమందిచాడు. వేల్ రికార్డ్స్ ఈ పాటల్ని విడుదల చేస్తోంది.