సీఎం భార్య‌కే వేధింపులు త‌ప్ప‌లేదు…సామాన్యుడికి ర‌క్ష‌ణ ఎలా..!

ఆమె ఓ ఎంపీ.. సీఎం భార్య‌.. అయినా ఆక‌తాయి వేధింపుల నుంచి త‌ప్పించుకోలేక‌పోయారామె! ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఉదంతం దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ భార్య డింపుల్ యాద‌వ్ సెల్‌ఫోన్‌కు ఓ 22 ఏళ్ల యువ‌కుడు అస‌భ్య‌క‌ర సందేశాలు పంపాడు. మొద‌ట్లో వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోయినా, నానాటికీ వీటి తీవ్ర‌త పెర‌గ‌డంతో విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారామె.

ఈ విష‌యాన్ని స‌మాజ్‌వాదీ పార్టీ యూత్ వింగ్‌కు తెలియ‌జేయ‌డంతో పాటూ పోలీసుల‌నూ రంగంలోకి దింపారు. దీంతో డింపుల్‌ను మాన‌సికంగా హింసించిన ఆ..యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్‌చేశారు. ఇప్ప‌డీ ఉదంతం సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఓ సీఎం భార్య‌కే వేధింపులు త‌ప్ప‌క‌పోతే ఇక సామాన్య మ‌హిళ‌క‌కు ర‌క్ష‌ణ ఏంట‌ని? ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నాస్త్రాలు సంధిస్తున్నారు.