బ్రదర్ కు దిమ్మతిరిగి బొమ్మరివర్స్ అయింది

బ్రదర్ కు దిమ్మతిరిగి బొమ్మరివర్స్ అయింది. బ్రదర్ ఎవరు, బొమ్మ రివర్సై దిమ్మ ఎవరికి తిరిగిందో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అహో ఓహో అన్న బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాకు కనీస ఆదరణ కరవైంది. జనాలు కనీసం బ్రదర్ అండ్ సిస్టర్ ను చూసేందుకు థియేటర్ల వైపు వెళ్లట్లేదట. దాదాపు ౧౨ కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఫస్ట్ డే కనీసం కోటి రూపాయలు కూడా దాటలేదంటేనే అర్థం చేసుకోవచ్చు. బహుషా నరేష్ ఈ పరిణామం చూసి ఖంగు తిని ఉంటాడు. కామెడీ సినిమాలకు కేరాఫ్ ఆడ్రస్ గా మారిన అల్లరి నరేష్ కు కూడా ఈ పరిస్థితి వస్తుందని ఊహించి ఉండడు.

సిటీలో ఓ మంచి థియేటర్ లో ఒక షో హౌస్ ఫుల్ అయితే ౪౮౦౦౦ వస్తుంది. అయితే రోజు మొత్తం బ్రదర్ ఆఫ్ బొమ్మాళిని ఆడించినా ౪౮౦౦౦ రాలేదంటేనే ఈ సినిమా ఓపెనింగ్స్ ఎంత భీభత్సంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రొడ్డకొట్టుడు స్టోరీతో నిర్మించిన ఈ సినిమాతో నిర్మాతకు భారీ నష్టాలు వచ్చే ఛాన్సుందని పై లెక్కలు చూస్తేనే అర్థమవుతోంది. కదా. కనీసం ఇప్పటికైనా హీరో నరేష్ తన రాబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడని ఆశిద్దాం.