సిగ్గు సిగ్గు రాష్ట్రపతి ఎవరో ఆలియాకు తెలియదట

కుర్రకారు తాజా కలల రాణి ఆలియా భట్. హిందీలో చేసింది రెండు మూడు సినిమాలే అయినా అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. అంతేకాదు హాట్ హాట్ అందాలతో కుర్రకారుని కవ్విస్తోంది. ఇటీవలే వరుసగా హైవే, టూ స్టేట్స్ సినిమాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇదంతా బాగానే ఉంది. అమ్మడి జనరల్ నాలెడ్జ్ మాత్రం మరీ దారణమని ఇటీవలే ప్రూవ్ చేసుకుంది. ఎంత దారుణమంటే భారత రాష్ట్రపతి ఎవరని కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో అడిగితే… పృథ్వీరాజ్ చౌహన్ అని చెప్పి అందరితో తిట్లు తింటోంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఆలియా చెప్పిన సమాధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ఎవరో కూడా తెలియకపోవడం మరీ విడ్డూరంగా ఉందని దుమ్మెత్తి పోస్తున్నారు. ఆలియా కావాలనే బిల్డప్ ఇస్తోందా లేక నిజంగానే భారత రాష్ట్రపతి ఎవరో తెలియదా అంటూ ఫైర్ అవుతున్నారు. 

అయితే దీని గురించి తాను పెద్దగా ఫీల్ అవ్వట్లేదని అంటోంది ఆలియా. తనపై విమర్శలు చేసేవారి గురించి పట్టించుకోనంటోంది. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదంటోంది.