వైఫ్ ఆఫ్ రామ్ మూవీ రివ్యూ

ప్రత్యేక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది నటి మంచు లక్ష్మి. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. తాజాగా వైఫ్ ఆఫ్ రామ్ అనే చిత్రంతో మనముందుకు వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయని చెబుతోంది. విజయ్ యెలకంటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మరి దర్శకుడు తన చిత్రంతో థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అందించాడా..మంచు లక్ష్మి చెప్పినట్టు ఎడ్ట్ ఆఫ్ ది సీట్ థ్రిల్ కలిగించారా లేదా చూద్దాం…

చాలా వరకు బాలీవుడ్ సినిమాల్ని చూసి ఇలా మన తెలుగు దర్శక నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీయరా అనే కామెంట్స్ వింటూ ఉంటాం. కానీ వైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమా చూశాక…. బాలీవుడ్ స్టైల్లో కథ, కథనం ఉన్న చిత్రంగా అనిపిస్తుంది. దర్శకుడు విజయ్ అల్లుకున్న కథ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో జరిగే పరిణామాలు థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. దీక్ష (మంచు లక్ష్మి), రామ్ (సామ్రాట్) భార్యా భర్తలు. దీక్ష ప్రెగ్నెంట్ కూడా. సరదాగా రిసార్ట్ కు వెళ్లిన తన భర్తను ఎవరో హత్య చేశారని కంప్లైంట్ ఇస్తుంది. ఇక అక్కడి నుంచి పోలీసుల ఎంక్వైరీ మొదలవుతుంది. కానీ దీక్ష సంతృప్తి చెందదు. తనకున్న ఆధారాలతో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది. ఈ ఎంక్వైరీలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తుంటాయి.. రామ్ స్నేహితుడు రాకీ (ఆదర్శ్) నే మర్డర్ చేశాడనే కోణంలో దీక్ష పరిశోధన సాగిస్తుంది. దీని కోసం పోలీసు చారీ (ప్రియదర్శి) సహాయం చేస్తుంటాడు. ఇంతకూ రామ్ ను హత్య చేసిందెవరు. నిజంగానే రాకీ తన స్నేహితుడు రామ్ ను హత్య చేశాడా. దీక్ష చేసిన పరిశోధనలో వెల్లడైన విషయాలేంటి. చారీ ఎలాంటి విషయాల్ని పరిగట్టాడు. తన భర్త హత్య వెనక ఉన్నదెవరు… ఇలాంటి విషయాలు మాత్రం థియేటర్లోనే చూడాలి.

మర్డర్ మిస్టరీలు చాలానే వస్తుంటాయి. అయితే ఈ తరహా చిత్రాల్లో థ్రిల్లింగ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. దర్శకుడు విజయ్ వాటిమీద బాగా కాన్ సన్ ట్రేట్ చేయగలిగాడు. చాలా వరకు ఆడియెన్ కు తర్వాతి సీన్ ఎలా ఉంటుందో అనే అనుమానం రాకుండా చేయగలిగాడు. ఆద్యంతం ఉత్కంఠతను కలిగించే కథా, కథనాలతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అందించింది వైఫ్ ఆఫ్ రామ్. మంచు లక్మి దీక్ష క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోయింది. ప్రతి అమ్మాయి కూడా రిలేట్ అయ్యే విధంగా ఈ పాత్రను దర్శకుడు తీర్చి దిద్దాడు. ప్రేక్షకులకు కొత్త అనుభూతులను తప్పకుండా అందిస్తుంది. ఈ కథకు సినిమాటోగ్రాఫర్ సామల భాస్కర్, ఎడిటర్ తమ్మిరాజులు అందించిన సహాకారం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా సినిమాటిక్ ఎలివేషన్స్ ఉండవు. దీక్ష పాత్ర కు మంచు లక్ష్మి పూర్తి న్యాయం చేసింది. కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయి. రఘు ధీక్షిత్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథను ప్రేక్షకులకు దగ్గర చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. మర్డర్ మిస్టరీలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల్న తప్పకుండా థ్రిల్ కు గురి చేస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో ప్రియదర్శి రివీల్ చేసే పాయింట్స్ అదుర్స్. ఈ సమయంలో మంచు లక్ష్మి రివెంజ్ డ్రామాను రివీల్ చేస్తారు. నిజంగానే ఎడ్జ్ ఆప్ ది సీట్ అనిపిస్తుంది. ఆదర్శ్ కు చాలా మంచి పాత్ర దక్కింది. ముఖ్యంగా ప్రియదర్శి సినిమాకు బాగా హెల్ప్ అయ్యాడు. శ్రీకాంత్ అయ్యంగార్ ఎస్ ఐ పాత్రలో విలనీ షేడ్స్ లో కనిపించాడు. సామ్రాట్ కి మంచి బ్రేక్ ఇచ్చే పాత్ర ఇది. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. మంచి క్వాలిటీతో సినిమా నిర్మించారు.

మంచు లక్ష్మి ఆర్టిస్టుగా నే కాకుండా నిర్మాత గానూ డిఫరెంట్ సినిమాను ప్రేక్షకులకు అందించడంలో సక్సెస్ సాధించారు. మర్డర్ మిస్టరీలు అందరూ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేరు. కానీ మంచు లక్ష్మితో విజయ్ చేసిన ప్రయోగం సక్సెస్ అయినట్టే. ఈకథ అందరికీ ఎగ్జైట్ మెంట్ ఇస్తుంది. ఓవరాల్ గా… ఇది తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

PB Rating : 3.25/5