విన్నర్ మూవీ రివ్యూ….

సాయి ధరమ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా… అనసూయ ఐటమ్ సాంగ్ లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఠాగూర్ మధు, బుజ్జి సంయుక్తంగా నిర్మించిన చిత్రం విన్నర్. తమన్ మ్యూజిక్ అందించాడు, ఛోటా కె నాయుడు కెమెరామెన్ గా వర్క్ చేశారు.

రేసుగుర్రాల కథ ఇది. రేసు గుర్రాలన్నా నాన్న అన్నా అస్సలు ఇష్టం లేని హీరో… రేసులో ఎందుకు పాల్గొన్నాడు. నాన్న కోసం ఎందుకు పరితపించాడన్నదే అసలు కథ. ఇందులో మెయిన్ ఎట్రాక్షన్ కామెడీ. వెన్నెల కిషోర్, పృథ్వీ, ఆలీ కామెడీ హైలైట్ గా నిలిచింది. సాయి ధరమ్ తేజ్ ఎనర్జిటిక్ గా చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ అక్కడక్కడ ఎద అందాల్ని, ఒక్కోసారి నాభి అందాల్ని, ఇంకొన్నిసార్లు తొడ
అందాల్ని చూపించి టెంప్ట్ చేసింది. ఇక అనసూయ సైతం ఐటమ్ సాంగ్ సారీ స్పెషల్ సాంగ్ (ఐటమ్ అంటే సూయ సూయ సూయ అనసూయకు కోపం)… సోసోగా ఉంది. ఇంకా బాగా చేయాల్సింది అనిపించింది. తమన్ కూడా పాటల కోసం ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. రేసుగుర్రంలా పరుగెత్తేలా ఉంటుందనుకున్నాం. కానీ స్పీడ్ కూడా తగ్గింది. సినిమా స్లోగా ఉంటుంది.

ఇక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిన చిత్రమిది. ఎమోషన్స్, లవ్, రివెంజ్ లు, ఛాలెంజ్ లతో సాగిపోయే చిత్రమిది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఊహించన ఇంటర్వెల్ వస్తుంది అనుకున్న టైంలో వచ్చే ట్విస్ట్ బాగుంది. ఇక రెండో భాగంలో రేసుగుర్రం కోసం హీరో తయారవ్వడం బాగుంది. ఓవరాల్ గా మాస్ కి మెచ్చే… కమర్షియల్ ఫార్ములా బేస్ డ్ సినిమా.

PB Rating : 3/5