జయవర్థనే సెంచరీ: ఆప్ఘాన్‌పై చచ్చీ చెడీ గెలిచిన శ్రీలంక

ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో మరో సంచలనం తప్పింది. మాజీ ఛాంపియన్ శ్రీలంక తొలిసారిగా ప్రపంచకప్ ఆడుతున్న పసికూన శ్రీలంక చేతిలో ఓటమి నుంచి తప్పించుకుంది. ఆదివారం జరిగిన గ్రూఫ్ మ్యాచ్‌లో శ్రీలంక అతి కష్టంమీద ఆ వికెట్లతో ఆప్ఘాన్‌ను ఓడించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆప్ఘనిస్తాన్ 49.4 ఓవర్లలో 232 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఆప్ఘాన్ జట్టులో ఓపెనర్లు అహ్మది 24, జాయ్ 54, షెన్వారి 38, నబీ 21, అష్రాఫ్ 28 పరుగులు చేశారు. లంక బౌలర్లలో మలింగ-3, మాథ్యూస్-3, లక్మల్-2 వికెట్లు తీశారు. 

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టులో ఓపెనర్లు ఇద్దరు డక్ అవుట్ అయ్యారు. 17/3 పీకల్లోతు కష్టాల్లో ఉంది. తర్వాత సీనియర్ ఆటగాడు మహేల జయవర్థనే సెంచరీతో జట్టును ఆదుకోవడంతో కాస్త కుదుట పడింది. చివర్లో పెరీరా 26 బంతుల్లో 47 పరుగులు చేయడంతో శ్రీలంక కష్టం మీద విన్ అయ్యింది. పెరీరా లేకపోతే శ్రీలంకకు పసికూన చేతిలో పరాజయం తప్పేదికాదు. సెంచరీతో జట్టును ఆదుకున్న జయవర్థనేకు మ్యాన్ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

శ్రీలంకకు ఈ విజయంతో రెండు పాయింట్లు లభించాయి. కాగా శ్రీలంకకు చెమటలు పట్టించిన ఆప్ఘానిస్తాన్‌పై ఆ దేశంలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆప్ఘాన్‌ను మెచ్చుకుంటున్నారు.