యాదాద్రి అభివృద్ధికి కేసీఆర్ డిజైనింగ్‌

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న యాదాద్రి అభివృద్ధి ప‌నులు మ‌రో వారం, ప‌దిరోజ‌ల్లో ప్రారంభం కావాలంటూ సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. ఆ ప్రాంతాన్ని దేశంలోనే ప్ర‌ముఖ‌ ఆధ్యాత్మ‌క ప‌ర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని అధికారుల‌కు సూచించారు. యాదాద్రి ప‌నుల‌పై సీఎస్ రాజీవ్‌శ‌ర్మ‌తో క‌లిసి స‌మీక్షించి వారికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ప‌నులు చేప‌ట్టేందుకు నిధులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని, వీటిని ప్రారంభించ‌డ‌మే త‌రువాయి అని అన్నారాయ‌న‌.

ఇదిలా ఉంటే యాద్రాద్రి అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌ముఖ ఆర్కిటెక్ ఆనంద్ సాయి సార‌థ్యం వ‌హిస్తున్నారు. యాదాద్రి స‌మీపంలో ఉన్న 11 ఎక‌రాల స్థ‌లంలో మూడు అతిథి గృహాలు నిర్మించ‌నుండ‌డంతో పాటు, పుష్క‌రిణిని విస్త‌రించ‌నున్నారు. అదేవిధంగా గుట్ట కింద పెళ్లిళ్లు చేసుకునే క‌ళ్యాణ మండ‌పాలు నిర్మించాల్సి ఉంది. వీట‌న్నింటికీ ప్ర‌భుత్వం గ‌డిచిన రెండు బ‌డ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించ‌గా, టాటా, అంబానీ, జెన్ కో , బెల్ లాంటి సంస్థ‌లు మ‌రో రూ.500కోట్లు స‌మ‌కూర్చేందుకు ముందుకువ‌చ్చాయి.