యమలీల 2 ఫస్ట్ లుక్ విడుదల

ఇరయ్యేళ్ల తర్వాత యమలీల చిత్రానికి సీక్వెల్ సిద్ధమౌతోంది. ఎస్వీకృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. మళ్లీ ఇన్నాళ్లకు యమలీల 2 చిత్రం తెరకెక్కుతోంది. 

పార్క్ హయత్ లో ఈచిత్ర ఫస్ట్ లుక్ తో పాటు చిత్ర నటీనటుల్ని పరిచయం చేసే కార్యక్రం సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. మోహన్ బాబు యముడిగా నటిస్తున్నారు. బ్రహ్మానందం చిత్ర గుప్తుడిగా నటిస్తున్నారు.

డా.కెవి.సతీష్ హీరోగా పరిచయమౌతున్నాడు. సౌత్ ఆఫ్రికాకు చెందిన దియా నికోలస్ హీరోయిన్ గా నటిస్తోంది. 

డి.ఎస్.మాక్స్, క్రిష్వీ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా కె.అచ్చిరెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్ కి అత్యధిక ప్రాధాన్యముంటుంది.