యమన్ మూవీ రివ్యూ

బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన మరో చిత్రం యమన్. విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకునే విజయ్ ఆంటోని ఈసారి రాజకీయాల్ని ఎంచుకున్నాడు. రాజకీయాల్లో ఉండే ఎత్తుగడల్ని ప్రధానాస్త్రంగా తెరకెక్కించాడు. తన తండ్రిని చంపిన వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు. రాజకీయంగా ఎదిగేందుకు ఎన్ని అస్త్రాల్ని ప్రయోగించాడన్నదే అసలు కథ. హీరోయిన్ గా మియా జార్జ్ నటించింది. సినిమాలోనూ హీరోయిన్ గానే నటించింది.

సినిమాలో నటించిన ఇతర పాత్రధారులు మనకు కొత్త. అయినప్పటికీ పెర్ ఫార్మెన్సులతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు ప్రధాన బలం కథ. రాజకీయ ఎత్తుగడలు చాలా బాగున్నాయి. ఒకరిని తొక్కి మరొకరు ఎదిగే క్రమాన్ని బాగా చూపించారు. విజయ్ ఆంటోని తనదైన స్టైల్లో రాజకీయాల్ని చూపించారు. దర్శకుడు విజయ్ ఆంటోనీ సీరియస్ నెస్ ను బాగా ఉపయోగించుకున్నాడు. పాటలు కూడా బాగున్నాయి. భాషాశ్రీ మాటలు బాగున్నాయి.

అయితే ఓవర్ లెంగ్త్ అనిపించింది. సినిమా స్లోగా ఉంటుంది. కాబట్టి… లెంగ్త్ తగ్గించుకుంటే బాగుండేదనిపించింది. ముఖ్యంగా రెండో భాగం మరీ ఎక్కువగా ఉంది. దీంతో చాలా చోట్ల బోర్ కొడుతుంది. ఓవరాల్ గా రాజకీయ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకోగల చిత్రమిది.

PB Rating : 3.25/5