వైకాపా నేత భూమా శోభా నాగిరెడ్డి మృతి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే వైకాపా నేత శోభా నాగిరెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బుధవారం రాత్రి ఆళ్లగడ్డ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభానాగిరెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కేర్ వైద్యులు ప్రకటించారు. 

ఆమె మృతికి పలువురు సినీ రాజకీయనాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు వైకాపా కార్యకర్తలు ఆమె భౌతికకాయం సందర్శించేందుకు కేర్ ఆసుపత్రికి వస్తున్నారు.