డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వైకాపా ఎమ్మెల్యే కూతురు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ప్రముఖుల పిల్లలు పట్టుబడడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల పలు సినీతారలతో పాటు వారి పిల్లలు కూడా పట్టుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో శనివారం అర్థరాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కృష్ణా జిల్లా పామర్రు వైకాపా ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కుమార్తె కీర్తి పట్టుబడ్డారు. ఆమె శనివారం రాత్రి తన స్నేహితులతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసింది.ఎక్కువగా మద్యం సేవించింది. ఆమె అతిగా మద్యం సేవించి ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆమె శరీరంలో 105 ఎంజీ బ్లడ్ ఆల్కాహాల్ ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు ఆమె నడుపుతున్న వాహనాన్ని సీజ్ చేశారు.