బాత్‌రూం వివాదం…ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

త‌న వివాహానికి ముందు మరుగుదొడ్డి నిర్మిచమంటే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. జార్ఖండ్‌లోని దుమ్క పట్టణంలో శనివారం జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఖూబుకుమారి (17) బీఏ మొదటి సంవత్సరం చదువుతుంది. తమ ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో, తాత ఇంట్లో ఉన్న మరుగుదొడ్డిని ఉపయోగిస్తూ వచ్చింది. త‌న పెళ్లికి ముందు మ‌రుగుదొడ్డు క‌ట్టాల‌ని ఆమె ప‌లుమార్లు తల్లిదండ్రులకు చెప్పినా వారు పట్టించుకోలేదు.

లారీ డ్రైవర్‌ అయిన ఆమె తండ్రి సమీప పట్టణానికి వెళ్లగా, తల్లి వ్యవసాయ పనులకు వెళ్లింది. వారి చ‌ర్య‌ల‌తో మ‌న‌స్థాపానికి గురైన ఆమె ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న దుమ్కా జిల్లా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని డీఐజీ తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్మల్ గ్రామ్ పథకం కింద ప్ర‌తి ఇంటికి మ‌రుగుదొడ్డి నిర్మించాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.