చరణ్ గోవిందుడికి యువన్ సంగీతం

రాంచరణ్, కాజల్ జంటగా, క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ తారగణంతో నిర్మిస్తున్న చిత్రం గోవిందుడు అందరి వాడేలే.

ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందించనున్నాడు. గతంలో ఈ చిత్రానికి తమన్ ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన ట్యూన్స్ తో కృష్ణవంశీ, చెర్రీ సంతృప్తి చెందలేదు. దీంతో సంగీతం అందించే బాధ్యతను యువన్ శంకర్ రాజాకు అప్పజెప్పారు. 

ఇక ఈ చిత్ర షూటింగ్ విషయానికొస్తే.. కన్యాకుమారి, పొల్లాచ్చి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని హైదరాబాద్ చేరారు. ఏప్రిల్ 21నుంచి హైదరాబాద్ లో రామానాయుడు సినీ విలేజ్ లో వేసిన హౌస్ సెట్ లో ప్రధాన తారాగణం అంతా నటించే భారీ షెడ్యూల్ దాదాపు 40 రోజులు జరుగుతుంది. దీని తర్వాత ఫారిన్ లో పాటలు చిత్రీకరిస్తారు. 

రాజ్ కిరణ్, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందట. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కృష్ణవంశీ తీర్చిదిద్దుతున్నారు.