• Home
  • Sample Page
Palli Batani
  • Home
  • Top Stories
  • News
  • Reviews
  • Gossips
No Result
View All Result
  • Home
  • Top Stories
  • News
  • Reviews
  • Gossips
No Result
View All Result
Palli Batani
No Result
View All Result

*”డియర్ మేఘ” కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నాం – నిర్మాత అర్జున్ దాస్యన్*

Dear megha producer arjun dasyam interview

admin by admin
September 1, 2021
in Top Stories
0
*”డియర్ మేఘ” కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నాం – నిర్మాత అర్జున్ దాస్యన్*

*”డియర్ మేఘ” కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నాం – నిర్మాత అర్జున్ దాస్యన్*

వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తొలి చిత్రంగా డియర్ మేఘను నిర్మించారు నిర్మాత అర్జున్ దాస్యన్. మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరిగా తెరకెక్కిన డియర్ మేఘ ఈ నెల 3న ప్రేక్షకుల ముందుకు థియేటర్ లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మీడియాతో సినిమా విశేషాలు తెలిపారు.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ…

– ఇది నా మొదటి సినిమా. నా నేటివ్ ప్లేస్ నిర్మల్. నేను పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేశాను. లండన్ లో వర్క్ చేశాను. హైదరాబాద్ లోనూ వర్క్ చేశాను. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. డియర్ మేఘ నా రెండో సినిమా అవ్వాలి కానీ….వీఎన్ ఆదిత్య గారి సినిమా ఆలస్యమై ఇది మొదటి సినిమాగా వస్తోంది.

– నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత సినిమాల మీద ఇష్టం పెరిగి నిర్మాత అవ్వాలని పరిశ్రమకు వచ్చాను. సినిమా నిర్మాణ సంస్థ పెట్టాలని అనుకున్నప్పుడు రెండేళ్లు ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాను. మన పరిశ్రమలో ఉన్న వాళ్లతో ట్రావెల్ చేశాను. వీఎన్ ఆదిత్య గారితో పరిచయం వల్ల టాలీవుడ్ గురించి చాలా విషయాలు తెలిశాయి.

– డియర్ మేఘ ఒక లవ్ స్టోరి. ఫీమేల్ కోణంలో సాగుతుంది. స్టోరీ ఎక్కువగా రివీల్ చేయలేను. మంచి టెక్నికల్ టీమ్ ఉంది. హైదరాబాద్, ముంబై,గోవా లో షూట్ చేశాం. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. హరి గౌర మ్యూజిక్ కు చాలా పేరొచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలకు మంచి పేరొచ్చింది. నాలుగో పాట రిలీజ్ చేస్తున్నాం.

– ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరి. మేఘ అనే క్యారెక్టర్ కోణంలో సినిమా సాగుతుంది. అబ్బాయి లవ్ స్టోరిలు చాలా చూసి ఉంటాం. కానీ ఇది మేఘ అనే అమ్మాయి పర్సెప్షన్ లో కొత్తగా ఉంటుంది. ఆండ్రూ గారి సినిమాటోగ్రఫీ వల్ల త్వరగా షూట్ చేయగలిగాం. కొవిడ్ టైమ్ లో షూటింగ్ చేసినా మా యూనిట్ వాళ్లకు ఎవరికీ కొవిడ్ రాలేదు.

– థియేటర్ లలో సినిమాకు ఆదరణ బాగానే ఉంటోంది. ఇటీవల ఎస్ఆర్ కళ్యాణ మండపం లాంటి చిత్రాన్ని సక్సెస్ చేశారు. మా తొలి సినిమా కాబట్టి, డియర్ మేఘను థియేటర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నాం. డబ్బు కంటే మాకు సినిమా అంటే ప్యాషన్ అందుకే ధైర్యంగా థియేటర్ లో విడుదల చేయబోతున్నాం.

– ఇది మిలటరీ స్టైల్ లో చేసిన సినిమా డియర్ మేఘ. ప్రొడక్షన్ సైడ్ ఖర్చు పెరగకుండా చూసుకున్నాం. మేఘా ఆకాష్ మెచ్యూర్డ్ పర్మార్మెన్స్ చూపించింది. అర్జున్ సోమయాజులు తెలుగు బ్యాక్ గ్రౌండ్ ఉన్న అబ్బాయే. ఆదిత్ అరుణ్ కు దక్కాల్సిన పేరు ఇంకా రాలేదని అనుకుంటున్నాను. ఈ సినిమాతో ఆ గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం.

– సూపర్ స్టార్ కిడ్నాప్ అనే మూవీని చేశారు సుశాంత్ రెడ్డి. డియర్ మేఘ ఆయనకు రెండో చిత్రం. తను అనుకున్న కథను చాలా స్పష్టంగా, ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత సుశాంత్ కు దర్శకుడిగా పేరు తెచ్చుకుంటారు.

– వీఎన్ ఆదిత్య సినిమా తర్వాత పెద్ద హీరోతో ఓ సినిమా అనౌన్స్ చేయబోతున్నాం. చిరంజీవి గారికి నేను అభిమానిని. కానీ ఆయనను ఇప్పటిదాకా కలిసే అవకాశం రాలేదు. డియర్ మేఘ ఫైనల్ అవుట్ పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఆ దైర్యంతోనే థియేటర్ లలో డియర్ మేఘను రిలీజ్ చేయబోతున్నాం.

– నాకు అన్ని రకాల సినిమాలు ఇష్టం. ఈ జానర్ లోనే సినిమాలు నిర్మించాలని అనుకోవడం లేదు. మార్వల్ స్టోరీస్ నుంచి షార్ట్ ఫిలింస్ దాకా అన్నీ చూస్తాను. బాగున్నంత వరకు ఆ కంటెంట్ ఏంటి అనే తేడాలు చూడను. సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలనే గట్టి నిర్ణయంతోనే టాలీవుడ్ లో అడుగుపెట్టాను. కష్టమైనా సుఖమైనా ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాను. చాలా మంది కొత్త దర్శకులు, రచయితలు నన్ను అప్రోచ్ అవుతున్నారు. కొత్త కథలు వింటున్నాం.

– మా డియర్ మేఘ పాటలు, ట్రైలర్ చూడండి, నచ్చితే సినిమాకు రండి. అన్ని సేప్టీ ప్రికాషన్స్ తీసుకుని థియేటర్ లో ఎంజాయ్ చేయండి.

Tags: arjun dasyamDear meghainterviewproducer
ShareTweetPin
Previous Post

ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ ‘జయహో ఇండియన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..

Next Post

సెప్టెంబర్ లో గ్రాండ్ గా “పోస్టర్” సినిమాను రిలీజ్ చేయనున్న యూ ఎఫ్ ఓ సంస్థ.! (UFO)

Next Post
సెప్టెంబర్ లో గ్రాండ్ గా “పోస్టర్” సినిమాను రిలీజ్ చేయనున్న యూ ఎఫ్ ఓ సంస్థ.! (UFO)

సెప్టెంబర్ లో గ్రాండ్ గా "పోస్టర్" సినిమాను రిలీజ్ చేయనున్న యూ ఎఫ్ ఓ సంస్థ.! (UFO)

Please login to join discussion

Recent Posts

  • సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’
  • ‘సోదర సోదరీమణులారా…’ ఫస్ట్ లుక్ విడుదల
  • ఆనంద్ ఆడియో ద్వారా ఘోస్ట్ ఆడియో విడుదల
  • కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ
  • రివెంజ్ ట్రైల‌ర్ ని విడుదల చేసిన దర్శకుడు ఎన్. శంకర్

Recent Comments

No comments to show.
Palli Batani

© 2021 PalliBatani.com - Designed by 10gminds.

Navigate Site

  • Home
  • Sample Page

Follow Us

No Result
View All Result
  • Home
  • Sample Page

© 2021 PalliBatani.com - Designed by 10gminds.