డియర్ మేఘ మూవీ రివ్యూ :
తుంగభద్ర.. గరుడ వేగ… చీకటి గదిలో చితక్కకొట్టుడు చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ క్రేజ్ ని సంపాదించుకున్న అదిత్ అరుణ్… ఇప్పుడు “డియర్ మేఘ” అంటూ మనముందుకు వచ్చాడు. లై, రాజ రాజ చోర మూవీస్ తో ఆకట్టుకున్న మేఘా ఆకాష్… ఇందులో టైటిల్ రోల్ పోషించింది. మరో కుర్ర హీరో అర్జున్ సోమయాజులు ఓ కీలకమైన పాత్ర పోషించారు. ట్రయాంగిల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు.
వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తొలి చిత్రంగా “డియర్ మేఘను” నిర్మించారు నిర్మాత అర్జున్ దాస్యన్. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సున్నితమైన… అందమైన ప్రేమకథ ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథేంటంటే :
మేఘ(మేఘా ఆకాష్),.అర్జున్(అర్జున్ సోమయాజులు) ఇద్దరూ క్లాస్ మేట్స్. మేఘా.. అర్జున్ ని చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటుంది. అయితే ఆ విషయం.. అర్జున్ ముందు వెల్లడించడానికి చాలా భయపడిపోతూ ఉంటుంది. చివరకు ధైర్యం తెచ్చుకొని అర్జున్ కి అసలు విషయం చెబుతుంది. అయితే అర్జున్ కూడా మేఘాను తెగ ఇష్టపడుతూ… ఆమెను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించే పలు సందర్భాలను మేఘాకు వివరిస్తాడు. ఇలా ఒకరినొకరు బాగా ఇష్టపడి ప్రేమించుకున్న జంట జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? మేఘా జీవితంలోకి అదిత్ ఎలా వచ్చాడు? అతన్ని మేఘ ఎందుకు ప్రేమిస్తుంది? అర్జున్.. అదిత్ ల లవ్ స్టొరీలకు ఎండ్ కార్డ్ ఎలా పడింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడండి.
కథ విశ్లేషణ: ఇలాంటి సున్నితమైన ప్రేమకథలను ఆసక్తికరమైన కథ.. కథనాలతో తెరపైన ఆవిష్కరిస్తే బాక్సాఫీస్ వద్ద విజయం సునాయాసంగా సాధించొచ్చు. ఇలాంటి సినిమాలు సాధారణంగా కాలేజీ నేపథ్యంలోనే తెరకెక్కుతాయి. “డియర్ మేఘ” కూడా టీనేజ్ నుంచి… అడల్ట్ లైఫ్ ను బేస్ చేసుకొని హీరోయిన్ సెంట్రిక్ గా రాసుకున్న భావోద్వేగాలతో కూడిన ముక్కోణపు ప్రేమ కథ. ఎక్కడా బోరింగ్ లేకుండా ఓ కొత్త తరహా అందమైన ప్రేమ కథ… డియర్ మేఘ. ఓ వైపు టీనేజ్ వయసులో పుట్టే ప్రేమ… ఆ తరువాత అడల్ట్ లైఫ్ లో చిగురించే ప్రేమ.. ఈ రెండింటి మధ్య జరిగే భావోద్వేగ సంఘర్షణ… దానికి డైరెక్టర్ ఇచ్చిన పరిష్కారం… అలానే తల్లీ కొడుకుల మధ్య ఉండే సున్నితమైన ప్రేమానురాగాలు.. వెరసి “డియర్ మేఘ”ను ఇష్టపడేలా చేస్తాయి. ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కి ఇంట్రెస్టింగ్ కథనంతో పాటు.. వేగం కూడా ఉండాలి. లేకుంటే ప్రేక్షకుడు భారంగా ఫీలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా నెమ్మదిగా సాగ కుండా… చకచకా ముందుకు సాగిపోతుంది. మొదటి భాగంలో మేఘా ఆకాష్… అర్జున్ సోమయాజులతో టీనేజ్ లవ్ స్టొరీని నడిపించి… సెకెండ్ హాఫ్ నుంచి అదిత్ అరుణ్ తో అడల్ట్ లవ్ స్టొరీ ని నడిపించి.. ఆ తరువాత వచ్చే రెండు మూడు ట్విస్ట్ లతో మూవీని ఒక సాడ్ ఎండ్ తో శుభం కార్డు వేసిన విధానం ఆడియన్స్ ని భావోద్వేగాలకు గురిచేస్తుంది.
టైటిల్ రోల్ పోషించిన మేఘా ఆకాష్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్. టీనేజ్ లవ్ స్టొరీలోనూ… అడల్ట్ లవ్ స్టొరీలోనూ వెరీయేషన్ చూపించి తన హావ భావాలు ను పాలికించింది. దర్శకుడు చెప్పినట్టు.. ఈ కథకి ఈమెనే కరెక్ట్. ఇక సెకెండ్ హాఫ్ లో ఆదిత్ అరుణ్ తన ఎనర్జీ లెవల్స్ తో స్టోరీని నడిపించడమే కాకుండా ఆడియన్స్ బాగా గుర్తుంచుకొనే పాత్రను చాలా ఈజ్ తో చేసేశాడు. ప్రియురాలితో ప్రేమ సన్నివేశాల్లో గానీ.. తల్లీ కొడుకుల మధ్య వచ్చే ప్రేమానురాగాల సన్నివేశాలలోనూ… అదిత్ అరుణ్ చాలా బాగా నటించాడు. టీనేజ్ లవ్ కథలో నటించిన అర్జున్ సోమయాజులు కూడా మెప్పించారు. ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయలేని… ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేని ఓ టీనేజ్ యువకుని పాత్రలోనూ… ఆ తరువాత ఓ ట్విస్ట్ ఇచ్చి… మళ్లీ హీరోయిన్ కి దగ్గరయ్యే ప్రేమికుని పాత్రలో ఆకట్టుకున్నాడు. తల్లి పాత్రలో కనిపించిన పవిత్ర లోకేష్ యాజ్ యూజ్వల్ గా తల్లి పాత్రలో నటించి ఇప్పించింది. అదిత్ ఎనర్జీ లెవల్స్… పవిత్ర లోకేష్ తల్లి ప్రేమ చక్కగా మిక్స్ అయ్యి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.
గతంలో “సూపర్ స్టార్ కిడ్నాప్” అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన డైరెక్టర్ సుశాంత్ రెడ్డి… ఇప్పుడు “డియర్ మేఘ” అనే ఓ సెన్సిటివ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో దర్శకుడు ఎంచుకున్న కథ… కథనాలు బాగున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సెన్సిటివ్ ప్రేమ కథను సెల్యులాయిడ్ పై ఆవిష్కరించారు. మజిలీ, నిన్ను కోరి లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరిస్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని.. అలాంటి సేఫ్ జానర్ ని ఎంచుకుని ఈ మూవీని తెరకెక్కించి మరోసారి అలాంటి ముక్కోణపు ప్రేమకథను ప్రేక్షకులు మెచ్చేలా గెలిపించాడు. ప్రేమ కథలకు సంగీతం ప్రాణం అనుకోవచ్చు. డియర్ మేఘకు హరి గౌర బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతం కూడా అంతే అందంగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ప్రతి ఫ్రెమ్ ని అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. నిర్మాత అర్జున్ దాస్యం నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. వీకెండ్ లో “డియర్ మేఘ” ను సరదాగా ఓ సారి చూసేయండి.
రేటింగ్: 3.25/5