• Home
  • Sample Page
Palli Batani
  • Home
  • Top Stories
  • News
  • Reviews
  • Gossips
No Result
View All Result
  • Home
  • Top Stories
  • News
  • Reviews
  • Gossips
No Result
View All Result
Palli Batani
No Result
View All Result

ఆకట్టుకునే నువ్వే నా ప్రాణం..!

admin by admin
December 30, 2022
in cinema
0
ఆకట్టుకునే నువ్వే నా ప్రాణం..!

యూత్ ని బేస్ చేసుకుని తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా కమర్షియల్ హిట్ అవుతాయి. అందులోనూ కొంత మెసేజ్ వుండేలా తీస్తే… ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆదరిస్తారు. తాజాగా ఇలాంటి సినిమానే తీశారు దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి. ఇందులో కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే జంటగా నటించారు. దీనిని వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌ పతాకంపై శేషుదేవ రావ్‌ మలిశెట్టి నిర్మించారు. సుమన్, భానుచందర్‌, గిరి, యాంకర్ సోనీ చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి.
కథ: సంజు(కిరణ్ రాజ్) సరదాగా తిరుగుతూ… గైనకాలజిస్టుగా పనిచేసే కిరణ్(ప్రియా హెగ్డే)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే కిరణ్ మాత్రం అతని ప్రేమను అంగీకరించదు. కానీ… సంజు మాత్రం కిరణ్ వెంటపడుతూ… ఆమె ప్రేమను పొందడానికి చాలా రకాలుగా ట్రై చేస్తుంటాడు. అయితే ఓ సందర్భంలో సంజు సాధారణ యువకుడు కాదు… అతను కూడా ఓ బాధ్యతాయుతమైన పొజిషన్లో వున్న వ్యక్తి… పైగా ఎమ్మెల్యే ఆది శేషు(సుమన్) అని తెలుసుకుని… సంజుని ప్రేమించడం ప్రారంభిస్తుంది. అయితే.. కిరణ్ తండ్రి (భాను చందర్) కూడా సంజు తండ్రి ఆది శేషుకు మంచి మిత్రుడు కావడంతో… ఇద్దరికీ పెద్దల సమక్షంలో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లయిన తరువాత కిరణ్ పద్ధతిగా చీరలు కట్టుకోవడం సంజుకి అసలు ఇష్టం వుండదు. ఆమెను పొట్టి డ్రస్సుల్లో చూడాలని… పబ్ కు పోయి డిస్కో థెక్ లు వేయాలని బలవంతం చేస్తూ… మందు, సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఉన్నట్టుండి సంజు అలా ఎందుకు మారాడు? వీటన్నింటినీ కిరణ్ ఎలా భరించి సాల్వ్ చేసుకుంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ప్రేమకథలు చాలానే చూసుంటాం. కానీ… అందులో ఓ బాధ్యతాయుతమైన యువతీ యువకుల మధ్య కలిగే ప్రేమ కథని అందంగా తెరపై సెటిల్డ్ గా ఆవిష్కరించడం అంటే సాహసమే. కానీ.. నువ్వే నా ప్రాణం చిత్రంలో ఇది సాధ్యమైంది. ఓ బాధ్యత గల పోలీస్ అధికారి… పేదరికంతో ఇబ్బందులు పడే గర్భిణీల ఆరోగ్యం పట్ల ఎంతో బాధ్యతగా శ్రద్ధ తీసుకునే ఓ వైద్యురాలు… ఈ ఇద్దరి మధ్య ప్రేమకథని నడిపించి… ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ, పెళ్లితో నడిపించి… సెకెండాఫ్ లో సంప్రదాయంగా మెలిగే భార్యను పాశ్చాత్య పోకడలను అలవాటు చేసుకోవాలని హింసించే భర్త… దాన్నుంచి బయట పడటానికి హీరోయిన్ పడే కష్టాలు, సంజుని మార్చడానికి గిరి, సోనీ చౌదరి పాత్రలు ఎంటర్ చేసి… భార్యభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి అనే దానికి వీరి జంటను ఉదాహరణ చూపించడం… లాంటి సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. అలాగే యూత్ కి కావాల్సిన గ్లామర్ కోషంట్ కూడా ఇందులో ఉంది. హీరోయిన్ ప్రియా హెగ్డే అందాలు బాగా ఆకర్షిస్తాయ. చివర్లో వచ్చే ఐటెం సాంగ్ మాస్ ని బాగా ఆకట్టుకుంటుంది. అలాగే పెడదోవ పట్టే యువతకి తల్లిదండ్రులు చేయాల్సిన మార్గనిర్దేశాలను ఇందులో చూపించారు. ఫైనల్ గా నువ్వే నా ప్రాణం… యువతతో పాటు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.
హీరోగా నటించిన కిరణ్ రాజ్… ఇందులో ప్రేమికునిగా… బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ గా, మరో వైపు మద్యం, సిగరెట్లకు బానిసై… భార్యను మోడ్రన్ దుస్తుల్లో చూడాలనుకునే శాడిజం వున్న భర్తగా… ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు. పాటలు, ఫైట్లలోనూ తన ఈజ్ ను చూపించారు. హీరోయిన్ గా నటించిన ప్రియా హెగ్డే తన అందలతో పాటు… నటనతోనూ ఆకట్టుకుంటుంది. పాటల్లో తన అంద చందాలతో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. మరో వైపు సంప్రదాయ దస్తుల్లో పక్కింటి అమ్మాయిగా కనిపించింది. ఎమ్మెల్యే ఆది శేషు పాత్రలో సుమన్, హీరోయిన్ తండ్రి పాత్రలో భాను చందర్ నటించి మెప్పించారు. అలాగే పైకి ఎంతో అన్యోన్యతగా కనిపిస్తూ… లోపల బాగా పోట్లాడుకునే జంటగా కమెడియన్ గిరి, యాంకర్ సోనీ చౌదరిల పెయిర్ బాగా నవ్విస్తుంది.
దర్శకుడు శ్రీకృష్ణ మలిశెట్టి సివిల్ ఇంజినీర్ అయినా… దర్శకత్వ శాఖలో ఎంతో అనుభవం వున్న వ్యక్తిగా చిత్రాన్ని ఎంతో అందంగా వెండితెరపై ఆవిష్కరించారు. యూత్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ… ఎక్కడా ఒల్గారిటీ లేకుండా సినిమాని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. హీరోని మొదట ఓ సాధారణ యువకుని గా చూపించి… ఆ తరువాత అతను సామాన్యుడేమీ కాదు… అతనూ సొసైటీలో పలుకుబడి వున్న కుటుంబం నుంచి వచ్చిన వాడు… పైగా ఎంతో బాధ్యతా యుతమైన వృత్తిలో మెలిగే యువకుడు అని చూపించడం యువతకు ఇన్సిపిరేషన్. సంగీతం బాగుంది. మాస్ ను మెప్పించే పాటలున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ సెకెండాఫ్ లో ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాత శేషుదేవ రావ్‌ మలిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3

ShareTweetPin
Previous Post

‘లక్కీ లక్ష్మణ్’ని ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు : హీరో ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌

Next Post

ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే… లక్కీ లక్ష్మణ్

Next Post
ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే… లక్కీ లక్ష్మణ్

ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే... లక్కీ లక్ష్మణ్

Please login to join discussion

Recent Posts

  • సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’
  • ‘సోదర సోదరీమణులారా…’ ఫస్ట్ లుక్ విడుదల
  • ఆనంద్ ఆడియో ద్వారా ఘోస్ట్ ఆడియో విడుదల
  • కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న ఎఫ్ ఎమ్ 2 డబుల్ మస్తీ
  • రివెంజ్ ట్రైల‌ర్ ని విడుదల చేసిన దర్శకుడు ఎన్. శంకర్

Recent Comments

No comments to show.
Palli Batani

© 2021 PalliBatani.com - Designed by 10gminds.

Navigate Site

  • Home
  • Sample Page

Follow Us

No Result
View All Result
  • Home
  • Sample Page

© 2021 PalliBatani.com - Designed by 10gminds.